మోస్ట్ బ్యూటిఫుల్ నటిమని సమంత గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ ఏం మాయ చేసావే అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది. ఈ మూవీ లో ఈ బ్యూటీ తన నటనతో , అంతకుమించిన అందచందాలతో ప్రేక్షకులను కట్టిపడేసింది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ సక్సెస్ కావడంతో ఈమె అదిరిపోయే సినిమా అవకాశాలను ఆ తర్వాత దక్కించుకుంది. చాలా తక్కువ కాలంలోనే ఈ బ్యూటీ టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ స్థాయికి వెళ్ళింది. ఈమె కెరియర్ ప్రారంభంలోనే ఓ హిందీ సినిమాను రిజెక్ట్ చేసిందట. ఆ మూవీ అదిరిపోయే రేంజ్ బ్లాక్ బస్టర్ విజయం అందుకున్నట్లు తెలుస్తోంది. మరి ఈ ముద్దుగుమ్మ వదిలేసిన ఆ సినిమా ఏది? అనే వివరాలు తెలుసుకుందాం.

కొన్ని సంవత్సరాల క్రితం హిందీ లో స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ అనే సినిమా వచ్చిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ లో మోస్ట్ బ్యూటిఫుల్ నటిమని ఆలియా భట్ హీరోయిన్గా నటించింది. ఈ మూవీ సూపర్ సక్సెస్ కావడం , ఇందులో ఆలయ తన నటనతో , అందాలతో ప్రేక్షకులను కట్టిపడేయడంతో ఈ మూవీతో ఈమెకు హిందీ సినీ పరిశ్రమలో అదిరిపోయే రేంజ్ క్రేజ్ వచ్చింది. ఆ తర్వాత ఈమె హిందీ సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్ క్రేజ్ ను సంపాదించుకుంది. ఇక ఈ సినిమాలో హీరోయిన్గా మొదటగా ఈ మూవీ బృందం సమంత ను అనుకుందట. అందులో భాగంగా సమంత ను సంప్రదించిందట. కానీ ఈమె మాత్రం కొన్ని కారణాల వల్ల ఈ సినిమా చేయను అని చెప్పిందట. దానితో ఈ మూవీ బృందం వారు ఆలియా ను హీరోయిన్గా ఎంపిక చేసుకున్నారట. అలా సమంత స్టూడెంట్ "ఆఫ్ ది ఇయర్" సినిమాను రిజెక్ట్ చేయగా అందులో ఆలియా నటించినట్లు తెలుస్తోంది. ఇక ఈ వార్త వైరల్ కావడంతో సమంత "స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్" సినిమా చేసి ఉంటే ఇప్పుడు బాలీవుడ్ స్టార్ హీరోయిన్గా కెరీర్ ను కొనసాగించేది అని కొంత మంది తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: