సినిమాలో హీరో హీరోయిన్లు ఎవరైనా ఉండొచ్చు కానీ ఒక సినిమాలో అది కూడా జనాలు ఎక్స్పెక్ట్ చేసే బిగ్ బడా సినిమాలో ఆ స్టార్ హీరో ఫేవరెట్ హీరోయిన్ ఉంటే ఇక మాటలు లేవు ..మాట్లాడుకోవడాల్లేవ్.. ఓన్లీ రికార్డ్స్ బద్దలు కొట్టడాలే.  ఎస్ ప్రెసెంట్ అలాంటి ఒక స్పెషల్ కాంబోని సెట్ చేసుకున్నాడు బాలయ్య.  బాలయ్య అనగానే అందరికీ ముందుగా గుర్తొచ్చేది కోపం.  బాలయ్య కోపం ముందు ఎవరు కూడా సాటిరారు. ఆయన కళ్లు పెద్దవి చేస్తే ఎలాంటి వాళ్లైనా కూడా తోక ముడవాల్సిందే.


అయితే బాలయ్యకు ఎంత కోపం ఉందో అంత ప్రేమ కూడా ఉంది . తప్పు చేస్తే దండించడం మంచి పని చేస్తే పొగడడం బాలయ్య గుణం . కాగా బాలయ్య ఫేవరెట్ బ్యూటీ ఎవరు అంటే మాత్రం సిమ్రాన్ అని చెప్పుకోక తప్పదు . గతంలో వీళ్ళ కాంబోలో వచ్చిన సినిమాలు అన్ని కూడా సూపర్ డూపర్ హిట్ అయ్యాయి.  చరిత్ర తిరగరాసాయి. పైగా ఇప్పుడు బాలయ్య ఫేవరెట్ బ్యూటీ ఎవరు అంటే మాత్రం కచ్చితంగా నయనతార అనే చెప్పాలి .



ఈ విషయాన్ని చాలా సార్లు బాలయ్య కూడా కన్ఫామ్ చేశాడు. వీళ్ళ కాంబోలో వచ్చిన సినిమాలు అన్నీ కూడా అభిమానులను బాగా ఆకట్టుకున్నాయి.  కాగా అఖండ 2 సినిమా పూజా కార్యక్రమాలు రీసెంట్ గానే పూర్తి చేసుకున్నారు బాలయ్య . ఈ సినిమాలో ప్రగ్యా జైశ్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది . అయితే అఖండ 2 లో ఒక స్పెషల్ పాత్రలో నయనతార కనిపించబోతుంది అన్న వార్త ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. ఈ పాత్రకు ఆమైతేనే కరెక్ట్ అంటూ బాలయ్య పట్టుబట్టి మరి ఆమెను ఒప్పించారట . తెలుగు సినిమాలని ఈమధ్య ఓకే చేయని నయనతార బాలయ్య కోసం ఈ పాత్రను ఓకే చేసిందట . ప్రజెంట్ ఇదే న్యూస్ హాట్ హాట్ గా ట్రెండ్ అవుతుంది . ఇదే నిజమైతే మాత్రం బాలయ్య అఖండ 2 వేరే లెవెల్ లో రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది అనడంలో సందేహమే లేదు . చూద్దాం మరి ఏం జరుగుతుందో..??

మరింత సమాచారం తెలుసుకోండి: