టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర సంక్రాంతి పండుగ వచ్చింది అంటే అదిరిపోయే రేంజ్ సందడి వాతావరణం నెలకొంటూ ఉంటుంది. ఎక్కువ శాతం సంక్రాంతి పండుగ వచ్చింది అంటే స్టార్ హీరోల సినిమాలు విడుదల అవుతూ ఉంటాయి. జనాలు కూడా సంక్రాంతి పండుగ సందర్భంగా స్టార్ హీరోల సినిమాలను థియేటర్లలో చూడడానికి ఎంతో ఇష్టపడుతూ ఉంటారు. దానితో ఎక్కువ శాతం చిన్న సినిమాలను , మీడియం రేంజ్ సినిమాలను సంక్రాంతి బరిలో మేకర్స్ నిలపరు. ఎందుకు అంటే స్టార్ హీరోలో సినిమాలు సంక్రాంతి పండుగకు విడుదల అవుతాయి కాబట్టి ఆ సమయంలో చిన్న , మీడియం రేంజ్ సినిమాలను విడుదల చేసినట్లయితే ఆ సినిమాలకు పెద్ద సంఖ్యలో థియేటర్లు దొరకడం కష్టం అవుతుంది.

కొన్ని థియేటర్లు దొరికినా కూడా ప్రేక్షకులు స్టార్ హీరోల సినిమాలను వదిలేసి చిన్న , మీడియం రేంజ్ హీరోల సినిమాలకు వచ్చే అవకాశం కూడా చాలా తక్కువ శాతం ఉంటుంది. కాబట్టి చిన్న , మీడియం రేంజ్ సినిమాలను సంక్రాంతి పండగ సందర్భంగా ఎక్కువగా విడుదల చేయరు. ఇకపోతే వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా చాలా సినిమాలు విడుదలకు రెడీగా ఉన్నాయి. అందులో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న గేమ్ చేంజర్ , వెంకటేష్ , అనిల్ రావిపూడి కాంబోలో పొందుతున్న సినిమాను , బాలయ్య , బాబి కాంబోలో రూపొందుతున్న సినిమాలను విడుదల చేయనున్నారు.

వచ్చే సంవత్సరం ఎన్ని తెలుగు స్టార్ హీరోల సినిమాలు సంక్రాంతికి విడుదలకు రెడీగా ఉంటే సందీప్ కిషన్ హీరోగా రూపొందుతున్న మజాకా మూవీ ని వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగకు విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. దానితో చాలా మంది అనవసరంగా సందీప్ కిషన్ రిస్క్ చేస్తున్నాడు. సినిమాకు యావరేజ్ టాక్ వచ్చిన కూడా కలెక్షన్లు పెద్దగా దక్కవు. వేరే టైం లో అయితే మంచి కలెక్షన్లు దక్కుతాయి. అనవసరంగా సంక్రాంతి సీజన్ కి రావడం వల్ల ఆయనకు నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయి అని అభిప్రాయాన్ని కొంత మంది జనాలు వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Sk