టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్  ప్రేక్షకులకు హీరోయిన్ హన్సిక గురించి పరిచయం చేయాల్సిన పనిలేదు.. చైల్డ్ యాక్టర్ గా తన కెరీర్ ని మొదలుపెట్టిన హన్సిక తెలుగులో అల్లు అర్జున్ నటించిన దేశముదురు సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది.ఆ తర్వాత ఈ ముద్దుగుమ్మ వరుసగా సినిమాలలో నటించింది. దేశముదురు సినిమా సమయంలో హన్సిక చదువుతూ ఉండేదట. అతి తక్కువ సమయంలోనే ఫేమ్ తో పాటు బడ హీరోలతో నటించే అవకాశాలు రావడంతో స్టార్ స్టేటస్ ని తక్కువ సమయంలోనే అందుకుంది.


స్టార్ డం వచ్చిన సమయంలోనే హన్సిక బరువు పెరగడంతో సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చింది. ఆ తర్వాత శింబు తో ప్రేమలో పడడంతో కొన్నేళ్లపాటు సజావుగా సాగిన మళ్లీ బ్రేకప్ చేసుకున్నారు. ఆ వెంటనే హన్సిక బరువు తగ్గాలని నిర్ణయించుకొని మళ్లీ సినిమాలలోకి రీఎంట్రీ ఇచ్చి సక్సెస్ అయ్యింది. 2022లో హన్సిక తన ప్రేమించిన సోహైల్ ను వివాహం చేసుకుంది. అయితే ఇది తనకు రెండో వివాహమైనప్పటికీ కూడా హన్సిక చేసుకోవడం గమనార్హం.


ఈమధ్య లేడీ ఓరియంటెడ్ చిత్రాలలో నటిస్తూనే పలు రకాల షోలకు జడ్జిగా వ్యవహరిస్తున్నది. అయితే ఎప్పుడెప్పుడు అభిమానులు హన్సిక నుంచి గుడ్ న్యూస్ వస్తుందా అంటూ ఎదురు చూస్తున్నారు కానీ ఇటీవలే ఒక శుభవార్తను అయితే తెలియజేసింది. అదేమిటంటే తన భర్త సోహైల్ తో కలిసి ఒక అందమైన బంగ్లాను కట్టించుకొని మరి గృహప్రవేశం చేసినట్లుగా కొన్ని ఫోటోలను షేర్ చేసింది హన్సిక. కొత్త ప్రారంభమంటూ ఈ ఫోటోలకు హన్సిక ఈ ఫోటోలను షేర్ చేయగా అభిమానులు లైక్స్ కామెంట్లతో శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అయితే ఈ కొత్త ఇంటికి ఆమె కుటుంబ సభ్యులతో మాత్రమే పాల్గొన్నట్లు సమాచారం. మొత్తానికి కొత్త ఇంటితో శుభవార్తను చెప్పిన హన్సిక మరో గుడ్ న్యూస్ ని ఏమైనా చెబుతుందేమో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: