యూత్ ను ఆకట్టుకునే స్టోరీలతో ఎన్నో సినిమాలు వచ్చాయి.. అలా వచ్చిన వాటిలో ఎక్కువ ప్రేమ కథలే.. చిన్న సినిమా పెద్ద సినిమా అనే తేడా లేకుండా కంటెంట్ ఉన్న సినిమాలు మంచి విజయాలు అందుకుంటున్నాయి. అలాగే ఎలాంటి అంచనాలు  లేకుండా వచ్చి సంచలన విజయమందుకున్న సినిమాలు కూడా ఎన్నో ఉన్నాయి.. అలాంటి సినిమాల్లో 10th క్లాస్ సినిమా కూడా ఒకటి. ఈ మూవీ యూత్ ను బాగానే ఆకట్టుకుంది 2006లో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. రొమాంటిక్ డ్రామాగా వచ్చిన ఈ సినిమాకు చందు దర్శకత్వం వహించారు.


ఎస్పీ ఎంటర్టైన్మెంట్స్ పై వెంకట శ్యామ్‌ ప్రసాద్ ఈ సినిమాను నిర్మించారు. అలాగే ఈ మూవీలో భరత్ , శరణ్య ముఖ్య పాత్రలో కనిపిస్తారు.. అలాగే మిక్కీ జే మేయర్  ఈ సినిమాకు సంగీతం అందించారు. అదే విధంగా ఆ రోజుల్లో ఈ సినిమా పాటలకు మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది.. ఇప్పటికి సినిమా పాటలు వినిపిస్తూనే ఉంటాయి.  అయితే ఈ సినిమాలో హీరోయిన్గా నటించిన అమ్మాయి అందరి మనసులను గెలుచుకుంది.. ఆమె పేరు శరణ్య .. ఈ ముద్దుగుమ్మ తన నటనతో మెప్పించింది శరణ్య‌ గురించి చాలా తక్కువ‌ మందికి మాత్రమే తెలుసు. ఈ భామ ఇప్పుడు ఎలా ఉంది.. ఎక్కడ ఉంది అనే విషయలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక మరి ఆమె ఏం చేస్తుంది అనే విషయాలు ఇక్కడ తెలుసుకుందాం.


అయితే శరణ్య ఇప్పుడు చాలా మారిపోయింది. ఆమెను ఇప్పుడు చూస్తే ఎవ‌రు గుర్తుపట్టడం చాల‌ కష్టం.. ఇక శరణ్య ఫోటోలు సోషల్ మీడియాలో ప్ర‌స్తుతం తెగ వైరల్ అవుతున్నాయి. అయితే ఆమె ఫోటోలు చూసి అభిమానులు, ప్రేక్షకులు మ‌త్రం షాక్ అవుతున్నారు. తెలుగు సినిమాల కంటే శరణ్య ఎక్కువగా తమిళ్ సినిమాల్లోనే నటించింది. 2014 వరకు ఆమే వరుసగా సినిమాలు చేస్తు వ‌చ్చింది..అయితే శ‌ర‌ణ్య‌ ఇప్పుడు సినిమాలకు దూరంగా ఉంటుంది. పెళ్లి తర్వాత శరణ్య పూర్తిగా ఫ్యామిలీకే త‌న‌ టైం కేటాయిస్తుంది. కాగా శరణ్య సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. త‌న‌ నిత్యం రకరకాల ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తుంది. ఈ క్రమంలో శరణ్య ఫోటోలు సోష‌ల్ మీడియ‌లో చక్కర్లు కొడుతున్నాయి.





మరింత సమాచారం తెలుసుకోండి: