గత కొద్ది రోజులుగా బాలీవుడ్లో హాట్ టాపిక్ గా మారుతున్న వ్యవహారం ఐశ్వర్యరాయ్ ,అభిషేక్ బచ్చన్ విడాకుల వ్యవహారం.. వీరిద్దరూ చాలా కాలంగా దూరంగా ఉంటున్నారనే రూమర్స్ కూడా వినిపిస్తూ ఉన్నాయి. అలా అటు ఐశ్వర్య ఇటు అమితాబచ్చన్ కుటుంబానికి సంబంధించి ఏదో ఒక విషయం సోషల్ మీడియాలో వినిపిస్తూ ఉంటుంది. అయితే ఈ విషయం పైన అటు ఎవరూ కూడా స్పందించలేదు. ఈ రూమర్స్ మరింత వైరల్ గా మారుతూ ఉన్నాయి.


ముఖ్యంగా ఐశ్వర్యాన్ని అభిషేక్ మోసం చేశారనే విధంగా ఇప్పుడు బాలీవుడ్ లో పలు రకాల వార్తలు వినిపిస్తున్నాయి. అందుకే బిగ్ బి బర్తడే వేడుకలలో ఐశ్వర్య కనిపించడం లేదని మరొకసారి రూమర్స్ కి తెర లేపాయి. అయితే ఇప్పుడు తాజాగా అభిషేక్ బచ్చన్ ఒక నటితో ఎఫైర్ పెట్టుకున్నారని అందుకే ఐశ్వర్య విడాకులు కోరుతోంది అనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఆమె ఎవరో కాదు నిమ్రత్ కౌర్. 2022లో అభిషేక్ బచ్చన్ దాస్విని అనే సినిమా విడుదల అయింది.


ఈ చిత్రంలో అభిషేక్ తో కలిసి నటించిన నమ్రిత్ కౌర్  డేటింగ్ లో ఉన్నట్లు బాలీవుడ్ లో కథలుగా వినిపిస్తున్నాయి. ఈమె కారణంగానే అటు అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యారాయ్ విడాకులు తీసుకుంటున్నారని.. అందుకే అభిషేక్, ఐశ్వర్య ఇద్దరు కూడా ప్రస్తుతం ఒకే ఇంట్లో లేరనే విధంగా ప్రచారం అయితే వినిపిస్తోంది. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం నమ్రిత్ కౌర్ గురించి మాత్రం బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారుతోంది. అయితే  నమ్రిత్ కౌర్ గతంలో కూడా హీరో అక్షయ్ కుమార్ తో కూడా డేట్ చేసిందనే విధంగా వార్తలు వినిపించాయి.. మరి ఐశ్వర్యరాయ్ ,అభిషేక్ బచ్చన్ వ్యవహారంలో వినిపిస్తున్న ఈ వార్తల పైన ఈ నటి క్లారిటీ ఇస్తుందేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: