జబర్దస్త్ షో ద్వారా ఎంతో మంది కమెడియన్స్ కు గుర్తింపు సంపాదించేలా చేసింది.. ఆ తర్వాత సినిమాలలో నటిస్తూ బాగానే సంపాదించుకున్నారు.. ముఖ్యంగా కొంతమంది కమెడియన్స్ గా హీరోలుగా డైరెక్టర్లుగా మారి బాగానే క్రేజ్ సంపాదించుకున్నారు. అలా రాకింగ్ రాకేష్ కూడా తాజాగా కెసిఆర్ అనే సినిమాతో హీరోగా పరిచయం కాబోతున్నారు. ఈ సినిమా తెలంగాణ బ్యాడ్ గ్రాఫ్ లో తెరకెక్కించారు. వాస్తవానికి ఈ సినిమా ఎప్పుడో విడుదల కావాల్సి ఉండగా కొన్ని కారణాల చేత వాయిదా పడింది. తాజాగా కెసిఆర్ ట్రైలర్ ని కూడా విడుదల చేయడం జరిగింది.


గతంలో రిలీజ్ అయిన ట్రైలర్ విజువల్స్ సన్నివేశాలు అన్నీ కూడా పల్లెటూరికి సంబంధించినవిగా కనిపించాయి. తాజాగా విడుదలైన ట్రైలర్లో కూడా అందర్నీ ఆకట్టుకునే విధంగా కనిపిస్తున్నాయి.. నటి సత్య కృష్ణన్ కుమార్తె అనన్య కృష్ణ ఇందులో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాని రాకింగ్ రాకేష్ స్వయంగా నిర్మించారు.. ఈ సినిమా స్టోరీ మొత్తం లంబాడి వర్గానికి చెందిన వారి గురించి వారి యొక్క రియల్ లైఫ్ స్ఫూర్తితోనే తీసినట్లుగా ట్రైలర్ చూస్తే కనిపిస్తోంది.


కెసిఆర్ తన మరదలు చిన్ననాటి బంధాన్ని సైతం ట్రైలర్లు చూపించారు. తన మరదలితో వివాహం క్యాన్సిల్ అయిన తర్వాత హైదరాబాద్ కి వచ్చేసిన కెసిఆర్ అక్కడ ఏం చేస్తాడు తన లక్ష్యాన్ని సాధిస్తాడా లేడా అనే విషయాన్ని  తెరపైన చూడాలి. డైరెక్టర్ వేగా అంజి ఈ చిత్రానికి సినిమా ఆటోగ్రాఫర్ అద్భుతంగా ఉన్నది. ఈ సినిమా మొత్తం తెలంగాణ గ్రామీణ ప్రాంతాన్ని తలపిస్తోంది. ఈ సినిమా ఎమోషనల్ గా తెలంగాణ వాసులను బాగా ఆకట్టుకునేలా కనిపిస్తోంది. ఇందులో జోర్దార్ సుజాత, జబర్దస్త్ ప్రవీణ్ ,నవీన్ రాజు, కృష్ణ భగవాన్ తదితర నది నటులు సైతం నటించారు. ప్రస్తుతం విడుదలైన ట్రైలర్ చూస్తూ ఉంటే బలగం సినిమాని తలపించేలా కనిపిస్తోందని పలువురు నెటిజెన్స్ తెలుపుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: