టాలీవుడ్ ఇండస్ట్రీలో అక్కినేని కుటుంబానికి ఉన్న ఫాలోయింగ్ అంత కాదు. అయితే అలాంటి అక్కినేని కుటుంబంలో... చాలామంది హీరోలు ఉన్నారు. ముఖ్యంగా అక్కినేని నాగేశ్వరరావు వారసత్వాన్ని అందిపుచ్చుకొని... నాగార్జున ఇండస్ట్రీలో రాణిస్తుంటే.. ఆయన కొడుకులు కూడా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. అయితే నాగార్జున సక్సెస్ అయినంత ఆయన కొడుకులు సక్సెస్ కాలేకపోయారు. నాగచైతన్య మాత్రం బాగానే రాణిస్తున్నాడు.


అయితే అక్కినేని నాగచైతన్య రియల్.. పెను సవాళ్లు ఎదుర్కొంటన్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ హీరోయిన్ సమంతకు విడాకులు ఇవ్వడం... అటు ఇండస్ట్రీలో సరైన సక్సెస్ లేకపోవడంతో అక్కినేని నాగచైతన్య లైఫ్... గింగిరాలు తిరుగుతోంది. ఇలాంటి నేపథ్యంలోనే హీరోయిన్ శోభిత దూళిపాళ్లను... కొన్ని రోజులుగా లైన్లో పెట్టాడట అక్కినేని  నాగ చైతన్య. ఇక అటు షోబిత ధూళిపాళ్ల కుటుంబ సభ్యులు.. ఇటు అక్కినేని ఫ్యామిలీ ఒప్పుకోవడంతో వీరి వివాహం కూడా త్వరలోనే కాబోతుంది.

 

గత రెండు నెలల కింద అక్కినేని నాగచైతన్య హీరోయిన్... శోభిత ధూళిపాళ్ల ఎంగేజ్మెంట్ కార్యక్రమం జరిగిన సంగతి తెలిసిందే. ఆగస్టు 8వ తేదీన వీరిద్దరూ ఎంగేజ్మెంట్ చేసుకున్నారు.  ఈ విషయాన్ని అక్కినేని నాగార్జున.. ప్రకటించడం జరిగింది. దీంతో సమంతకు.. ఎదురు దెబ్బ తగిలినట్లు అయింది. ఇలాంటి నేపథ్యంలోనే... అక్కినేని నాగచైతన్య అలాగే శోభి త దూళి పాళ్ల వివాహం వచ్చే ఏడాది  జరిగే అవకాశాలు ఉన్నాయి.

 

అయితే పెళ్లి పనులు ఇప్పటినుంచి మొదలుపెట్టారట అక్కినేని కుటుంబ సభ్యులు.  ఇంతలోనే కాబోయే జంట అక్కినేని నాగచైతన్య అలాగే శోభిత దూళిపాళ్ల... ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళిపోతున్నారట. ఈ తరుణంలోనే తాజాగా ఓ లిఫ్ట్ లో అడ్డంగా దొరికిపోయారు. ఇద్దరు రొమాంటిక్ లుక్ లో చూస్తూ... లిఫ్ట్ లో ఉన్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్న నేపథ్యంలో  ఇలా వీరిద్దరూ తిరుగుతున్నారని చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: