స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో వచ్చి పాన్ ఇండియా వైజ్ గా భారీ విజయాన్ని అందుకున్న చిత్రం పుష్ప. ఈ సినిమాకి కొనసాగింపుగానే ఇప్పుడు పుష్ప-2 సినిమాని భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ రామోజీ ఫిలిం సిటీ, కాకినాడ ప్రాంతంలో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్నట్లు సమాచారం. ముఖ్యంగా పుష్ప-2 సినిమా రిలీజ్ డేట్ కి సంబంధించి చిత్ర బృందం పలు రకాల పోస్టర్స్ తో అప్డేట్ ఇస్తున్నది. పుష్ప చిత్రంలో సమంత స్పెషల్ సాంగ్ లో కనిపించింది ఇది హైలెట్గా నిలిచింది.



ఇప్పుడు పుష్ప-2 సినిమాలో ఎవరు స్పెషల్ సాంగ్ లో నటిస్తారనే విషయం పైన అభిమానులు చాలా ఎక్సైటింగ్ గా ఫీల్ అవుతున్నారు. అయితే ఇప్పుడు తాజాగా ఒక న్యూస్ అయితే టాలీవుడ్లో తెగ హల్చల్ చేస్తోంది. అదేమిటంటే పుష్ప-2 సినిమాలో శ్రద్ధా కపూర్ ని ఐటెం సాంగ్ చేసేలా సుకుమార్ ప్లాన్ చేస్తున్నట్లు వార్తలేనిపిస్తున్నాయి.ఈ సినిమా కోసం ఆమెకు ఏకంగా రూ .3 కోట్లకు పైగా రెమ్యూనరేషన్ ఇస్తున్నట్లు సమాచారం. ఈ విషయం పైన ఇంకా చిత్ర బృందం అధికారికంగా క్లారిటీ ఇవ్వాల్సి ఉన్నది.


గతంలో కూడా పుష్ప-2 స్పెషల్ సాంగ్ కి చాలామంది హీరోయిన్స్ పేరు వినిపించాయి. కానీ చిత్ర బృందం మాత్రం ఏ ఒక్కరి మీద క్లారిటీ ఇవ్వలేదు. పుష్ప సినిమాకి మించి మరి స్పెషల్ సాంగ్ ఉండేలా చిత్ర బృందం ప్లాన్ చేస్తున్నామని తెలియజేశారు. పుష్ప సినిమా క్రేజ్ కేవలం తెలుగులోనే కాకుండా ఇతర దేశాలలో కూడా పాక పోయింది అందుకే పుష్ప-2 చిత్రాన్ని సుకుమార్ చాలా అద్భుతంగా తెరకెక్కించే విధంగా ప్లాన్ చేస్తున్నారు. అంతేకాకుండా ఈ సినిమా 1000 కోట్ల టార్గెట్ తో కూడా బరిలోకి దిగబోతున్నట్లు సమాచారం. ఈ ఏడాది డిసెంబర్ 6న రిలీజ్ చేసే విధంగా ప్లాన్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: