* టాలీవుడ్ టాప్ హీరోయిన్ గా దూసుకుపోతున్న సమంత

* సోషల్ మీడియాలోనూ ఊర మాస్ ఫాలోయింగ్

* ఏకంగా అన్నీ కోట్లు వెనకేస్తుందా..?


టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..అందం, అభినయంతో టాలీవుడ్ టాప్ హీరోయిన్ గా మారింది…తెలుగు స్టార్ హీరోల అందరితో కలిసి నటించి ఎన్నో సూపర్ హిట్స్ తన ఖాతాలో వేసుకుంది.. సమంత ప్రస్తుతం సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తుంది.. గతంలో ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్ లో నటించి విమర్శకుల ప్రశంసలు అందుకున్న సమంత తాజాగా బాలీవుడ్ లో సిటాడెల్ అనే మరో బిగ్గెస్ట్ యాక్షన్ వెబ్ సిరీస్ లో నటించింది..ఫ్యామిలీ మ్యాన్ మేకర్స్ అయిన రాజ్ అండ్ డీకె దర్శకత్వంలో ఈ యాక్షన్ వెబ్ సిరీస్ రూపుదిద్దుకుంది.. ఈ సిరీస్ లో సమంత, వరుణ్ ధావన్ కలిసి నటించారు..నవంబర్ 7 న ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ బిగ్గెస్ట్ యాక్షన్ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది.. ఇటీవల రిలీజ్ అయిన ట్రైలర్ లో సమంత యాక్షన్ సన్నివేశాలతో అదరగొట్టింది.. ఇదిలా ఉంటే సమంత మయోసైటీస్ వ్యాధి కారణంగా గత కొంత కాలంగా సినిమాలకు కాస్త దూరంగా వుంది తెలుగులో సమంత చేసిన చివరి సినిమా ఖుషి..


త్వరలోనే తన ఓన్ ప్రొడక్షన్ నుంచి మంచి క్లాసిక్ మూవీ రాబోతుంది అని సమంత ఇటీవల ప్రకటించింది.. ఇదిలా ఉంటే సమంతకు యూత్ లో వున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..ఇంస్టాగ్రామ్ లో అయితే సమంత ఫాలోవర్స్ 36 మిలియన్స్ పైనే ఉండటం విశేషం. కాగా, సమంత సోషల్ మీడియా ద్వారా పలు బ్రాండ్స్ ను కూడా ప్రమోట్ చేస్తోంది.ఒక్కో సినిమాకు సమంత రూ.3.5 కోట్లకు పైనే రెమ్యునరేషన్ తీసుకుంటుందని సమాచారం.. కాగా ఇంస్టాగ్రామ్ వేదికగా బ్రాండ్ ప్రమోషన్స్ ద్వారా కూడా సమంత బాగానే సంపాదిస్తోంది. సమంతకు నెలకు సోషల్ మీడియా ద్వారా రూ.3 కోట్ల కు పైనే ఆదాయం వస్తుందని సమాచారం. ఇంస్టాగ్రామ్ లో తన పర్సనల్ లైఫ్ గురించి అలాగే ప్రొఫెషనల్ లైఫ్ గురించి నిరంతరం ఏదొక పోస్ట్ పెడుతూ తన ఫాలోవర్స్ ని అలరిస్తూ ఉంటుంది.. నాగ చైతన్యతో విడాకుల తరువాత సమంత ఎక్కువగా సోషల్ మీడియాలోనే గడుపుతుంది..

మరింత సమాచారం తెలుసుకోండి: