తెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న వారిలో సూపర్ స్టార్ మహేష్ బాబు ఒకరు. మహేష్ బాబు ఇప్పటివరకు సోలో హీరోగా 28 చిత్రాల్లో నటించాడు. మహేష్ బాబు కెరియర్ లో 28 వ మూవీ గా గుంటూరు కారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాల నడుమ ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ మూవీ థియేటర్లలో విడుదల అయ్యి ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పర్వాలేదు అనే స్థాయి విజయాన్ని అందుకుంది. ఇకపోతే మహేష్ బాబు కెరియర్ లో 29 వ సినిమాని రాజమౌళితో చేయబోతున్నాడు. ఈ సినిమా మరికొన్ని రోజుల్లోనే ప్రారంభం కానుంది.

ఈ సినిమాపై ఇండియా వ్యాప్తంగా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇకపోతే మహేష్ బాబు నటించిన 28 చిత్రాల్లో ఏకంగా తొమ్మిది సినిమాలకు నంది అవార్డులు వచ్చాయి. తెలుగు సినీ పరిశ్రమలో మరే హీరోకు ఈ రికార్డ్ సాధ్యం కాలేదు. ఇక మహేష్ బాబు తాను నటించిన తొలి చిత్రం అయినటువంటి రాజకుమారుడు సినిమాతో డేబ్ల్యూ హీరోగా నంది అవార్డును దక్కించుకున్నాడు. ఆ తర్వాత టక్కరి దొంగ చిత్రానికి స్పెషల్ జ్యూరీ నంది అవార్డును దక్కించుకున్నాడు. ఆ తర్వాత మురారి , అర్జున్ , నిజం , అతడు , దూకుడు , శ్రీమంతుడు సినిమాలకు ఉత్తమ నటుడిగా నంది అవార్డులు మహేష్ బాబుకు వచ్చాయి. అలాగే శ్రీమంతుడు సినిమాకి ఉత్తమ కో ప్రొడ్యూసర్ గా కూడా మహేష్ బాబు కు నంది అవార్డు దక్కింది. ఇకపోతే మహేష్ బాబు కు ఎన్నో సినిమాల ద్వారా నంది అవార్డులు వచ్చిన ఆయనకు ఏకంగా ఇండస్ట్రీ హిట్ ను అందించిన పోకిరి మూవీ కి మాత్రం నంది అవార్డు దక్కలేదు.

మహేష్ బాబు హీరో గా గోవా బ్యూటీ ఇలియానా హీరోయిన్గా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన పోకిరి సినిమా ఆల్ టైమ్ టాలీవుడ్ ఇండస్ట్రీ హాట్ గా నిలిచింది. ఇందులో మహేష్ అద్భుతమైన నటనను ప్రదర్శించాడు. ఈ మూవీ కి గాను మహేష్ కి నంది అవార్డు వస్తుంది అని చాలా మంది అనుకున్నారు. కానీ మహేష్ కు ఈ మూవీ ద్వారా మాత్రం నంది అవార్డు దక్కలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: