(టాలీవుడ్-ఇండియాహెరాల్డ్): ఏ చిత్ర పరిశ్రమలోనైనా అభిమానులుగా మనం మన హీరోలని,సెలబ్రిటీలని సోషల్ మీడియాలో ఫాలో అవుతూనే ఉంటాము.హీరోలు కూడా అభిమానులకు, ప్రేక్షకులకు దగ్గర అవ్వడం కోసం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంటారు. కొంతమంది హీరోలు చాలా యాక్టివ్ గా ఉంటే కొంతమంది అప్పుడప్పుడు పోస్టులు పెడుతూ ఉంటారు. ఇక అభిమానులు హీరోలు ఏ పోస్ట్ పెట్టినా వైరల్ చేస్తూనే ఉంటారు. తమ హీరోకి ఎక్కువమంది ఫాలోవర్స్ ఉండాలని కోరుకుంటారు. మాములు సెలబ్రిటీలకే మిలియన్స్ లో ఫాలోవర్స్ ఉన్నప్పుడు మరి హీరోలకి కూడా అంతకంటే ఎక్కువే ఉండాలని ఆశపడుతుంటారు.అయితే అలాంటి అభిమానులను దగ్గర చేసిన సోషల్ మీడియా అయినటువంటి ఇంస్టాగ్రామ్, ట్విట్టర్, ఫేస్బుక్ లాంటి ద్వారా ఎంతో మంది అభిమానులను దగ్గర చేసుకున్నటువంటి స్టార్ హీరోలలో ఒకరు సూపర్ స్టార్ మహేష్ బాబు.

అయితే ఆయనకున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రాజకుమారుడు  సినిమాతో హీరో ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాలనటుడిగాను ఎన్నో సినిమాల్లో నటించాడు.ఇక మహేష్ సినిమా వస్తుందంటే చాలా అభిమానులు ఆనందంలో తేలిపోతారు. సినిమా రిలీజ్ అయ్యిందంటే ఫ్యాన్స్ కు పండగే.అయితే అలాంటి మహేష్ సోషల్ మీడియాలోనూ రెచ్చిపోతుంటారు.ఇక మహేష్ సినిమా నుంచి కానీ వ్యక్తిగత విషయాలగురించి కానీ ఏ చిన్న విషయం లీక్ అయిన సోషల్ మీడియాలో ఫ్యాన్స్ హల్ చల్ చేస్తుంటారు.సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్స్ లో మహేష్ బాబు సూపర్ రికార్డ్ ను క్రియేట్ చేశారు.ప్రతి సోషల్ మీడియా వేదికలోనూ మహేశ్ కు కోటికి పైగా ఫాలోవర్లు సొంతం చేసుకున్నారు.ఫేస్ బుక్లో14 మిలియన్ల పైగా,ఇన్ స్టాగ్రామ్లో కూడా దాదాపు14.5 మిలియన్లతో,ట్విట్టర్లో కూడా దాదాపు 14 మిలియన్లతో మొత్తమ్మీద మహేష్ దాదాపు 40 మిలియన్ కు పైగా ఫాలోవర్స్ ఉన్నారు.అయితే మహేష్ ఇప్పటివరకు అన్ని రీజనల్ సినిమాలు చేసి కేవలం టాలీవుడ్ కే పరిమితం అయ్యాడు.ఆయన నెక్స్ట్రాజమౌళి సినిమాతో పాన్ వరల్డ్ అయితే ఫాలోవర్స్ అమాంతం పెరుగుతాయి అని అభిమానులు భావిస్తున్నారు.

మహేష్ బాబు నేతృత్వంలోని ఫౌండేషన్,తెలుగు డిజిటల్ మీడియా ఫెడరేషన్  భాగస్వామ్యాన్ని కలిగి ఉంది. విభిన్న రంగాలలో వ్యక్తులను ప్రోత్సహించడం ద్వారా సమాజాన్ని సానుకూలంగా ప్రభావితం చేయడానికి ఫౌండేషన్ యొక్క నిరంతర ప్రయత్నంలో ఈ సంఘం కీలక ఘట్టాన్ని కలిగి ఉంది.సితార ఘట్టమనేని నాయకత్వంలో, ఫౌండేషన్ యొక్క కార్యక్రమాలు కొత్త కోణాన్ని సంతరించుకున్నాయి మరియు ఆరోగ్య కార్డుల ద్వారా సోషల్ మీడియా ప్రభావితం చేసేవారికి కీలకమైన వైద్య సహాయం మరియు మద్దతును అందించాలని భావిస్తోంది. ఈ సహకారం కోసం సితార యొక్క ఉత్సాహం విద్య, ఆరోగ్య సంరక్షణ మరియు మొత్తం శ్రేయస్సును ప్రోత్సహించడంలో ఫౌండేషన్ యొక్క స్థిరమైన నిబద్ధతను ప్రతిధ్వనిస్తుంది.ఈ విధంగా సోషల్ మీడియను తండ్రి కూతుళ్లు ఒక ఊపు ఊపేస్తున్నారనడంలో ఆశ్చర్యం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: