•ఆర్ఆర్ఆర్ తో గ్లోబల్ స్థాయి గుర్తింపు..
•సినిమాలలోనే కాదు సోషల్ మీడియాలో కూడా స్టార్..
•అత్యధిక ఫాలోవర్స్ కలిగిన హీరోగా రెండవ స్థానం..
గ్లోబల్ స్టార్ అనగానే వెంటనే గుర్తుచే పేరు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. మెగా స్టార్ చిరంజీవి వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన రామ్ చరణ్ మొదటి సినిమాతో తన పర్ఫామెన్స్ తో మంచి మార్కులు వేయించుకున్నా.. చాలామంది హీరో పీస్ కాదు అంటూ ఎగతాళి చేశారు. మెగాస్టార్ కారణంగానే నెట్టుకొస్తున్నాడు అంటూ కామెంట్లు చేశారు. కానీ ఆ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో మగధీర సినిమా చేసి ఓవర్ నైట్ కి స్టార్ సెలబ్రిటీ అయిపోయారు. ఇక రాజమౌళి దర్శకత్వంలో సినిమా అంటే ఆ స్టార్ కి ఎంత గుర్తింపు లభిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. అలా మగధీరతో ఓవర్ నైట్ లోనే స్టార్ అయిపోయిన రాంచరణ్ పై నాడు ఎగతాళి చేసిన విమర్శకులే ప్రశంసలు కురిపించారు.
ఇకపోతే ఆ తర్వాత అడపాదడపా సినిమాలో చేస్తూ ప్రేక్షకులను అలరించిన రామ్ చరణ్ గత రెండేళ్ల క్రితం మళ్లీ రాజమౌళి దర్శకత్వంలో ఈసారి తన స్నేహితుడు ఎన్టీఆర్ తో జతకట్టాడు అదే ఆర్ ఆర్ ఆర్. ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజు క్యారెక్టర్ లో నటించి గ్లోబల్ స్థాయిలో పేరు సొంతం చేసుకున్నారు. ముఖ్యంగా ఈ సినిమా ద్వారా ఆస్కార్ వేదికపై సందడి చేశారు రామ్ చరణ్. ఈ ఒక్క సినిమాతో గ్లోబల్ స్టార్ ఇమేజ్ ని దక్కించుకున్న ఈయనకు సినిమాలలోనే కాదు సోషల్ మీడియాలో కూడా భారీ ఫాలోయింగ్ ఏర్పడింది.
ఈ నేపథ్యంలోనే ఇంస్టాగ్రామ్ లో ఏకంగా 24 మిలియన్ ఫాలోవర్స్ ను సొంతం చేసుకున్నారు రామ్ చరణ్. గత రెండు నెలల క్రితం 21 మిలియన్ ఫాలోవర్స్ కలిగిన ఈయన, కేవలం రెండు నెలల్లోని 24 మిలియన్ ఫాలోవర్స్ అంటే ఇక ఈయన రేంజ్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా తన బావ అల్లు అర్జున్ ను టార్గెట్ పెట్టుకున్నాడో ఏమో అంటూ నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం అల్లు అర్జున్ 24.5 మిలియన్ ఫాలోవర్స్ తో మొదటి స్థానంలో నిలవగా.. రెండవ స్థానంలో రామ్ చరణ్ నిలిచారు. మరి కొద్ది రోజుల్లో ఈ టార్గెట్ ను సునాయాసంగా పూర్తి చేస్తారని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.