సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ స్టేటస్ ను అందుకోవడం సులువు కాదు. టాలెంట్ ఉన్నా లక్ కలిసిరాక ఇండస్ట్రీకి దూరంగా ఉన్న బ్యూటీలు పదుల సంఖ్యలో ఉన్నారు. రీల్స్, షార్ట్ వీడియోలు చేయడం ద్వారా కొంతమంది బ్యూటీలు ఫాలోవర్లను ఊహించని స్థాయిలో పెంచుకోవడంతో పాటు డైరెక్టర్ల దృష్టిని ఆకర్షిస్తూ సత్తా చాటుతున్నారు. ఇలా ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా ముగ్గురు బ్యూటీలు ఇండస్ట్రీలో ప్రశంసలు అందుకున్నారు.
 
గద్దలకొండ గణేశ్ సినిమాలో బుజ్జమ్మ పాత్రలో మెరిసి మృణాళిని రవి ప్రశంసలు అందుకోవడంతో పాటు మరిన్ని ఆఫర్లను సొంతం చేసుకున్నారు. ఈ బ్యూటీ తొలి సినిమా సూపర్ డీలక్స్ కాగా డబ్ స్మాష్, టిక్ టాక్ వీడియోల ద్వారా ఈ బ్యూటీకి ప్రేక్షకుల్లో పెరిగిన క్రేజ్ అంతాఇంతా కాదు. ఈ బ్యూటీ ఫేవరెట్ డబ్ స్మాషర్ అవార్డును సైతం అందుకోవడం కొసమెరుపు. ఇన్ స్టాగ్రామ్ లో ఈ బ్యూటీకి 20 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు.
 
ఏజెంట్ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో లక్ పరీక్షించుకున్న సాక్షి వైద్య మహారాష్ట్రలోని థానేలో జన్మించారు. టీవీ యాడ్స్ లో, మ్యూజిక్ వీడియోలలో నటించిన ఈ ముద్దుగుమ్మ ఉస్తాద్ భగత్ సింగ్ లో నటిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇన్ స్టాగ్రామ్ లో ఈ బ్యూటీకి 9 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఈ మధ్య కాలంలో యువత హృదయాలను దోచుకున్న బ్యూటీ ఇమాన్వి  అనే సంగతి తెలిసిందే.
 
ప్రభాస్ హను రాఘవపూడి కాంబో మూవీలో మెయిన్ హీరోయిన్ గా ఇమాన్వి నటిస్తున్నారు. ఇమాన్వీ ఇస్మాయిల్ డ్యాన్స్ వీడియోలు సైతం సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతున్నాయి. ప్రభాస్ తర్వాత సినిమాలు సైతం భారీ హిట్లుగా నిలవాలని ఫ్యాన్ కోరుకుంటుండగా ఈ స్టార్ హీరో కెరీర్ ప్లాన్స్ ఏ విధంగా ఉండనున్నాయో చూడాల్సి ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: