మెగా ఫ్యామిలీకి సంబంధించిన వార్తలు ఈ మధ్యకాలంలో బాగా ట్రెండ్ అవుతూ ఉండడం మనం గమనిస్తున్నాం. మరి ముఖ్యంగా మెగా పవర్ స్టార్ గా పాపులారిటీ దక్కించుకున్న రాంచరణ్ ఆర్ ఆర్ ఆర్ లో నటించిన తర్వాత గ్లోబల్ స్థాయిలో గుర్తింపు సంపాదించుకున్నారు. అదే మూమెంట్లో రాంచరణ్ కి సంబంధించిన ప్రతి వార్త కూడా ఆ స్థాయిలోనే ట్రెండ్ అవుతూ వస్తుంది . ప్రెసెంట్ గేం చేంజర్ సినిమా రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్న రామ్ చరణ్ ..బుచ్చిబాబు సదా దర్శకత్వంలో ఒక సినిమాకు కమిట్ అయ్యాడు.


ఈ సినిమాలో జాన్వి కపూర్ హీరోయిన్గా నటిస్తుంది . కాగా ఈ సినిమా తర్వాత సుకుమార్ దర్శకత్వంలోనే ఒక సినిమా చేయబోతున్నాడు మన రామ్ చరణ్ . ఇలాంటి మూమెంట్లోనే చరణ్ కు సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది. రామ్ చరణ్ తల్లి సురేఖ ఆయనను లాగి పెట్టి కొట్టిందట . దానికి కారణం మరొక హీరో కావడం గమనార్హం. అది కూడా మెగా హీరోనే. ఆయన మరెవరో కాదు వరుణ్ తేజ్ .



వరుణ్ తేజ్ కారణంగా సురేఖ ..రామ్ చరణ్ ను లాగిపెట్టి కొట్టిందట. చిన్నతనంలో చరణ్ చాలా మొండి వాడిగా ఉండే వాడట . నా వస్తువు ఏదైన నాదే  అన్నట్లు బిహేవ్ చేసేవాడట . శ్రీజ - సుస్మితలను కూడా తన బొమ్మలను టచ్ చేయించేవాడు కాదట . అంత మొండిగా ఉండేవాడట రాంచరణ్ . ఇదే మూమెంట్లో ఒకసారి వరుణ్ ..చరణ్ బొమ్మ తీసుకొని పగలకొట్టేశాడట. ఆ బొమ్మ పోయింది  అన్న కోపంతో వరుణ్ తేజ్ ని కొట్టబోయాడట. దీంతో అక్కడే ఉన్న సురేఖ అది మంచి పద్ధతి కాదు అంటూ నచ్చ జెప్పిన వినలేదట. కోపంతో సురేఖ లాగిపెట్టి చరణ్ ని కొట్టిందట . ఆ తర్వాత సముదాయిస్తూ ఏది మంచి ఏది చెడు అంటూ ఆయనకు వివరించిందట . చిన్నప్పుడు అలా చేయడం వల్లనే ఇప్పుడు రామ్ చరణ్ ఇంత మంచి పద్ధతులు నేర్చుకున్నాడు అంటున్నారు మెగా ఫాన్స్. అంతేకాదు సురేఖ పెంపకాన్ని ఓ రేంజ్ లో పొగిడేస్తున్నారు..!

మరింత సమాచారం తెలుసుకోండి: