అక్కినేని ఫ్యామిలీకి సంబంధించి ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో మనం తరచుగా ఏదో ఒక వార్త వింటూనే వస్తూన్నాం.  మరీ ముఖ్యంగా సమంతని ప్రేమించి పెళ్లి చేసుకున్న నాగచైతన్య ఆమెకు విడాకులు ఇవ్వడం ..ఆ తర్వాత శోభిత ధూళిపాళ్లతో నిశ్చితార్ధం చేసుకోవడం .. త్వరలోనే ఆమెతో పెళ్లి పీటలు ఎక్కబోతూ ఉండడం ఇండస్ట్రీలో హాట్ హాట్ గా ట్రెండ్ అవుతుంది. ఇదే మూమెంట్లో అక్కినేని నాగచైతన్య హీరోయిన్ శోభిత పై ప్రత్యేక ఫోకస్ పెట్టారు జనాలు.  మరీ ముఖ్యంగా వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు? ఏం చేస్తున్నారు..? వాళ్ళ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటి..? అన్నదానిపై ఎక్కువగానే కాన్సన్ట్రేషన్ చేశారు.


కాగా సోషల్ మీడియాలో తాజాగా ఒక వార్త హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. పెళ్లికి ముందే నాగచైతన్య - శోభిత ధూళిపాళ్ల ఒక సినిమాలో కలిసి నటించబోతున్నారట . దానికి సంబంధించిన పనులు కూడా చకచకా కంప్లీట్ చేసేసుకుంటున్నారు ఈ జంట అంటూ ఓ న్యూస్ వైరల్ గా మారింది . నాగచైతన్య నటించబోతున్న ఒక సినిమాలో ఆయనకు కాబోయే భార్య శోభిత  కూడా సెకండ్ హీరోయిన్ గా ఒక్క చిన్న రోల్ లో కనిపించబోతుందట .



హైలైట్ ఏంటంటే ఈ సినిమాలో వీళ్ళిద్దరూ లవర్స్ గా మెప్పించబోతున్నారట . అయితే ఆల్రెడీ సమంతతో కూడా నాగచైతన్య ఇదేవిధంగా ముందుకు వెళ్లాడు . పెళ్లికి ముందే ఏ మాయ చేసావే, మనం ,ఆటోనగర్ సూర్య లాంటి సినిమాలలో ఇద్దరు కలిసి నటించి వావ్ అనిపించుకున్నారు.  ఇప్పుడు అదే సాంప్రదాయాన్ని మళ్లీ శోభిత విషయంలోనూ అప్లై చేస్తున్నారు అంటూ జనాలు ఓ  రేంజ్ లో ఆయనను ట్రోల్ చేస్తున్నారు . ఇదే ఏమో అక్కినేని సాంప్రదాయం అంటే అంటూ ఫన్నీగా కామెంట్స్ పెడుతున్నారు. అక్కినేని నాగార్జున సైతం అమలతో పెళ్లికి ముందే నటించి మెప్పించాడు. ఆ తర్వాత నాగచైతన్య - సమంత ఇప్పుడు శోభిత ధూళిపాళ్ల .. ఇలా ఇది ఒక సాంప్రదాయం లాగా అక్కినేని ఫ్యామిలీ ఫాలో అయిపోతుంది అంటూ జనాలు మాట్లాడుకుంటున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: