నందమూరి ఫ్యాన్స్ ని చాలా చాలా టెన్షన్ పెట్టేస్తున్నాడు ప్రశాంత్ నీల్.  మనకు తెలిసిందే ప్రశాంత్ నీల్ కి పాన్ ఇండియా లెవల్ లో క్రేజ్ ఉంది . ఆయన తెరకెక్కించింది చాలా చాలా తక్కువ సినిమాలు . కానీ ఆయన క్రేజ్ పాపులారిటీ మాత్రం 100 సినిమాలను తెరకెక్కించిన డైరెక్టర్ స్థాయిలోనే ఉంటుంది . దానికి కారణం ఆయన చూస్ చేసుకునే కంటెంట్ . ఆయన డెడికేషన్ . ఒక ప్రాజెక్టును తెరకెక్కిస్తున్నాడు అంటే అదే ప్రాజెక్ట్ పై ఫోకస్ చేస్తాడు . అంతేకాదు ఆ ప్రాజెక్టు కోసం కోట్లు అయినా ఖర్చు చేస్తాడు. అంతేకాదు నమ్మిన కంటెంట్ ని నమ్మకంగా తెరకెక్కించి.. జనాల నమ్మకాన్ని వమ్ము చేయకుండా నిలబెట్టుకుంటాడు .


అలాంటి సత్తా ఉన్న డైరెక్టర్ ప్రశాంత్ నీల్.  కాగా ప్రశాంత్ నీల్ - ఎన్టీఆర్ తో ఒక సినిమా తెరకెక్కించబోతున్న విషయం అందరికీ తెలిసిందే.  ఈ సినిమాలో హీరోయిన్గా రష్మిక మందన్నాను ఆల్మోస్ట్ ఆల్ చూస్ చేసుకునేసారట.  కన్ఫామ్ కూడా అయిపోయింది.  రేపో మాపో అఫీషియల్ అనౌన్స్మెంట్ అంటూ కూడా వార్తలు వినపడుతున్నాయి.  అయితే ఈ సినిమా కోసం ఎన్టీఆర్ బిగ్ రిస్క్ చేయబోతున్నాడు అంటూ తెలుస్తుంది.



ఈ సినిమాలో ఎన్టీఆర్ డూప్ లేకుండా నటించబోతున్నారట . ఈ మధ్యకాలంలో స్టార్ హీరోస్ ఇదే అలవాటుగా చేసుకున్నారు . క్రేజ్ కోసం సినిమాలల్లో డూప్స్ లేకుండా చాలా చాలా రిస్కీ స్టాండ్స్ ను ఓన్ గా చేయబోతున్నారు. రాజమౌళి సినిమా కోసం మహేష్ బాబు ఇలాగే చేయబోతున్నారు. ఇప్పుడు ఆ లిస్టులోకి ఎన్టీఆర్ కూడా వచ్చేసాడు . ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ చేత డూప్ లేకుండా రిస్కీ షాట్స్  నటింపజేయాలి అనుకుంటున్నారట . తారక్ కూడా అందుకు ఓకే చెప్పేసారట . దీంతో నందమూరి ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు . ప్రశాంత్ నీల్ సినిమాలో ఎంత రిస్కీ స్టంట్స్ ఉంటాయో తెలిసిందే. మరి అలాంటి రిస్కీ  స్టాంట్స్  ఉన్నప్పుడు డూప్ లేకుండా తారక్ నటిస్తే ఏదైనా ప్రమాదం జరగచ్చేమో అంటూ భయపడుతున్నారు . కొందరు నందమూరి ఫ్యాన్స్ ప్రశాంత నీల్  పై  కోప్పడుతున్నారు..!

మరింత సమాచారం తెలుసుకోండి: