సినిమా ఇండస్ట్రీ లోకి ప్రతి సంవత్సరం ఎంతో మంది ముద్దుగుమ్మలు వస్తుంటారు. కానీ వారిలో కొంత మంది మాత్రమే సక్సెస్ అవుతుంటారు. ఇక కొంత మంది తమ నటనతో , అందాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న వారికి సరైన విజయాలు లేకపోవడంతో సినిమా ఇండస్ట్రీలో మంచి ఆఫర్లు దక్కవు. దానితో వారి కెరియర్ చాలా తక్కువ కాలంలోనే ముగిసిపోతుంది. ఇకపోతే అందం , అభినయం , అద్భుతమైన నటన ఉన్న కూడా సరైన విజయాలు లేకపోవడంతో అద్భుతమైన స్థాయిలో కెరియర్ను కొనసాగించ లేకపోయిన బ్యూటీలలో మంజరీ ఫడ్నిస్ ఒకరు. ఈ ముద్దుగుమ్మ అల్లరి నరేష్ హీరోగా రూపొందిన సిద్దు ఫ్రమ్ శ్రీకాకుళం మూవీ తో తెలుగు సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది. 

మూవీ యావరేజ్ విజయాన్ని అందుకున్న ఇందులో మంజరి తన నటనతో , అంతకు మించిన అందాలతో ప్రేక్షకులను కట్టిపడేసింది. ఇక ఈ బ్యూటీ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా మెహర్ రమేష్ దర్శకత్వంలో రూపొందిన శక్తి సినిమాలో నటించింది. శక్తి మూవీ లో జూనియర్ ఎన్టీఆర్ రెండు పాత్రలలో నటించాడు. ఒక పాత్రలో తండ్రిగానూ , మరొక పాత్రలో కొడుకు గానూ కనిపించాడు. ఇక తండ్రి పాత్రలో నటించిన జూనియర్ ఎన్టీఆర్ కి మంజరి జోడిగా నటించింది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ కావడంతో ఈ మూవీ ద్వారా ఈమెకు పెద్దగా గుర్తింపు రాలేదు. ఆ తర్వాత కూడా ఈమె నటించిన చాలా సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టడంతో ఈమెకు అవకాశాలు పెద్దగా రాలేదు. ఇక ఈ మధ్య కాలంలో ఈమె సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. తాజాగా ఈమె తన సోషల్ మీడియా అకౌంట్లో ఒక ఫోటో పోస్ట్ చేసింది. అందులో ఈమె అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉంది. ప్రస్తుతం ఆ ఫోటో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: