రాకింగ్ రాకేష్ స్వీయ నిర్మాణంలో కేసీఆర్ అనే సినిమా తెరకెక్కగా ఈ సినిమా ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ లో భాగంగా రాకేష్ ఈ కామెంట్లు చేశారు. నాకు కూతురు పుట్టిన తర్వాత మొదట వచ్చిన వ్యక్తి రోజాగారు అని ఆమె గడప బయటే రాజకీయాలను వదిలేసి వచ్చారని రాకింగ్ రాకేష్ కామెంట్లు చేశారు. గడప దాటి ఇంట్లోకి వచ్చిన వెంటనే ఆమె మా అమ్మ రోజమ్మ అని రాకింగ్ రాకేష్ పేర్కొన్నారు.
రోజమ్మ నాకు అన్నం పెట్టిందని నా కష్టాల్లో డబ్బులు కావాలంటే సహాయం చేసిందని అడగకుండా కూడా నాకు డబ్బులు సహాయం చేసే వ్యక్తి అంటే మాత్రం రోజా మాత్రమేనని రాకింగ్ రాకేష్ చెప్పుకొచ్చారు. కొంతమంది రోజాగారి నుంచి లబ్ధి పొంది కూడా ఇష్టానుసారం మాట్లాడతారని అది వాళ్ల వ్యక్తిగతం అని ఆయన అన్నారు. రాకింగ్ రాకేశ్ చెప్పిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
కెరీర్ పరంగా ఒక్కో మెట్టు పైకి ఎదిగి రాకింగ్ రాకేష్ తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకోవడం గమనార్హం. రాకింగ్ రాకేష్ నిర్మాతగా కూడా ఊహించని స్థాయిలో సక్సెస్ సాధించాలని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. రాకింగ్ రాకేష్ కు సినిమాలలో ఎక్కువ సంఖ్యలోనే ఆఫర్లు వస్తున్నాయని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. రోజాను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య అంతకంతకూ పెరుగుతుండగా ఆమె 2029 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా మళ్లీ విజయం సాధిస్తారో లేదో చూడాల్సి ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.