కన్నడ సినీ ఇండస్ట్రీలో  స్టార్ హీరోగా పేరుపొందిన కిచ్చా సుదీప్ తెలుగు ప్రేక్షకులకు బాగా సుపరిచితమే.. తన సినిమాలను డబ్బింగ్ చేస్తూ మరి తెలుగులో విడుదల చేయడమే కాకుండా పలు తెలుగు చిత్రాలలో కూడా నటించారు. తాజాగా హీరో కిచ్చా సుదీప్ ఇంట విషాద ఛాయలు నెలకొన్నట్లు తెలుస్తోంది. గత కొద్ది రోజులుగా వృద్ధాప్య సమస్యలతో ఇబ్బంది పడుతూ సుదీప్ తల్లి ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ ఈరోజు ఉదయం 7 గంటల సమయంలో తుదిశ్వాస విడిచినట్లు సమాచారం.



అయితే పిచ్చా సుదీప్ తల్లి వయసు 86 సంవత్సరాలట. కిచ్చా సుదీప్ తల్లి మరణించిందనే విషయం అభిమానులకు తెలియగానే ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు. ఈరోజు మధ్యాహ్నం పార్థివ దేహాన్ని జేపీ నగర్ లోని సుదీప్ ఇంటికి తీసుకురాబోతున్నారట. తన తల్లి అనారోగ్య కారణంగానే బిగ్ బాస్ షూటింగ్ ని కూడా నిన్నటి రోజున పూర్తి చేశారట. సుదీప్ తల్లి మృతి పట్ల పలువురు సినీ సెలబ్రిటీలు, అభిమానులు కూడా సంతాపాన్ని తెలియజేస్తున్నారు. బిగ్ బాస్ హౌస్ లో కూడా సుదీప్ తన తల్లి గురించి చాలా చెబుతూ ఎమోషనల్ గా మాట్లాడారు. కానీ అంతలోని తన తల్లి మరణించడంతో దిగ్భ్రాంతికి గురవుతున్నారు కిచ్చా సుదీప్..


కిచ్చా సుదీప్ తల్లి మంగళూరు ప్రాంతానికి చెందిన మహిళ.. అందుకే తన తల్లికి తుళు భాష అంటే చాలా ఇష్టమని సుదీప్ తెలియజేశారు. తన తల్లికి ఆ భాష అర్థం అవుతుంది కానీ మాట్లాడలేదని తెలియజేశారు. సుదీప్ కన్నడ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా గుర్తింపు సంపాదించుకున్నారు. తన సినిమాలు పాన్ ఇండియా లెవెల్లో విడుదల చేస్తూ భారీ పాపులారిటీ సంపాదించుకుంటున్న కిచ్చా సుదీప్ మరిన్ని చిత్రాలతో ప్రేక్షకులు ముందుకు రావాలని అభిమానులు కోరుకుంటున్నారు. తెలుగులో విడుదలయ్య పాన్ ఇండియా చిత్రాలులో కూడా నటించారు కీచ్చా సుదీప్.

మరింత సమాచారం తెలుసుకోండి: