రజనీ కాంత్ హీరోగా రూపొందిన వెట్టయన్ ఆయన సినిమా అక్టోబర్ 10 వ తేదీన విడుదల అయ్యి ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా తొమ్మిది రోజుల రన్ ను కంప్లీట్ చేసుకుంది. ఈ మూవీ కి విడుదల అయిన మొదటి రోజే మిక్స్డ్ టాక్ వచ్చింది. అయిన కూడా ఈ మూవీ మొదటి వారం రోజులు మంచి కలెక్షన్లను బాక్స్ ఆఫీస్ దగ్గర రాబట్టింది. కానీ రెండవ వారం స్టార్ట్ అయినప్పటి నుండి ఈ సినిమాకు పెద్ద స్థాయిలో కలెక్షన్లు రావడం లేదు. దానితో ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర అపజయాన్ని అందుకునే అవకాశాలు కనబడుతున్నాయి.

మూవీ కి తమిళనాడు ఏరియాలో 9 రోజుల్లో 86.80 కోట్ల కలెక్షన్లు వచ్చాయి. ఇక తమిళనాడు ఏరియాలో మంచి కలక్షన్లను తొమ్మిది రోజుల్లో రాబట్టిన ఈ సినిమా మిగతా ప్రాంతాలు మాత్రం ఆ స్థాయి కలెక్షన్లను రాబట్టడంలో విఫలం అయింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి ఈ మూవీ 9 రోజుల్లో 19.05 కోట్ల కలెక్షన్లు దక్కాయి. ఇక కర్ణాటక ఏరియాలో ఈ మూవీ కి 20.65 కోట్ల కలెక్షన్లు దక్కగా , కేరళ ఏరియాలో 14.30 కోట్ల కలెక్షన్లు దక్కాయి. రెస్ట్ ఆఫ్ ఇండియాలో 5.30 కోట్ల వసూళ్లను రాబట్టిన ఈ సినిమా , ఓవర్సీస్ లో 70.54 కోట్ల కలెక్షన్లను వసూలు చేసింది. మొత్తంగా 9 రోజుల్లో ఈ మూవీ కి వరల్డ్ వైడ్ గా 105.80 కోట్ల షేర్ ... 216.55 కోట్ల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి.

మూవీ కి 160 కోట్ల బిజినెస్ జరిగినట్లు సమాచారం.  ఈ మూవీ 162 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగినట్లు సమాచారం. ఈ మూవీ మరో 56.20 కోట్ల షేర్ కలెక్షన్లను రాబడితే హిట్ గా నిలుస్తుంది. ఈ మూవీ లో మంజు వారియర్ హీరోయిన్గా నటించగా ... టీజే జ్ఞానవేల్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: