. . . ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . .

నట‌సింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం వ‌రుస‌ క్రేజీ సినిమాల తో టాలీవుడ్ లోనే ఫుల్ ఫామ్‌ లో దూసుకుపోతున్నాడు . ప్రస్తుతం తన 109 వ‌ సినిమా ను యువ దర్శకుడు బాబీ తో చేస్తున్నాడు . అలాగే రీసెంట్ గానే బోయపాటి శ్రీను తో అఖండ సిక్వల్ షూటింగ్ ను కూడా మొదలు పెట్టాడు . ఇలా వరుస‌ క్రేజీ సినిమాల తో టాలీవుడ్ బాక్సాఫీస్ కి ద‌డపట్టిస్తున్నాడు .


అలాగే సీనియర్ స్టార్ హీరోల్లో కూడా ప్రస్తుతం బాలయ్య ఫుల్ సింగ్ లో ఉన్నాడు . ఇటు సినిమాల తో పాటు బుల్లి తెర పై కూడా అన్ స్టాపబుల్ షో తో ఇరగదీస్తున్నాడు . ఇక‌ త్వరలో నే అన్ స్టాపబుల్ సీజన్ 4 కూడా ప్రేక్షకులు ముందుకు రానుంది .  అయితే ఇప్పుడు బాలయ్య తదుపరి సినిమాల‌ గురించి ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియా లో వైరల్ గా మారింది . బాలయ్య ఓ  బాలీవుడ్ స్టార్ హీరో సినిమా లో గెస్ట్ రోల్ చేయబోతున్నారని బాలీవుడ్ మీడియాలో ఒక వార్త వైరల్ గా మారింది .


ఇప్పటికే బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ బాలయ్య కు ఆ స్టోరీ కూడా చెప్పినట్టు ఆయన నటించడాని కి ఓకే చెప్పారని కూడా అంటున్నారు . ఇప్పటికే మరో నందమూరి హీరో ఎన్టీఆర్ బాలీవుడ్లో హౄతిక్ రోషన్ తో పాటు వార్‌2లో  నటిస్తున్నాడు . ఇప్పుడు బాలయ్య కూడా బాలీవుడ్లో నటించడానికి రెడీ అయ్యాడు. త్వరలో నే ఆ సినిమాకు సంబంధించిన అధికారి ప్రకటన కూడా రానుందని అంటున్నారు . బాలయ్య పాత్ర కూడా ఆ సినిమాలో మన పురాణాలకు సంబంధించిన పాత్ర అని కూడా అంటున్నారు. క్యారెక్టర్ బాలయ్య కు మాత్రమే చేయగలరట.
 

మరింత సమాచారం తెలుసుకోండి: