తృప్తి దిమ్రి ఈ నటి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. రణబీర్ కపూర్ హీరోగా నటించిన యానిమల్ సినిమాలో ఈ బ్యూటీ సెకండ్ హీరోయిన్ గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ సినిమాలో ఈ బ్యూటీ నటించింది చాలా తక్కువ సమయం అయినప్పటికీ రష్మిక మందనకు మించిన క్రేజ్ దక్కించుకుంది. ఈ సినిమా సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో తృప్తి నటన, అందాలు చూసి ఏకంగా నేషనల్ క్రష్ అని ట్యాగ్ ఇచ్చేశారు.


యానిమల్ సినిమా క్రేజ్ తో ప్రస్తుతం ఈ భామకు బాలీవుడ్ తో పాటు సౌత్ లోనూ ఎన్నో సినిమా అవకాశాలు వస్తున్నాయి. టాలీవుడ్ లోనూ పలు ఛాన్సులు వస్తున్నట్లు సమాచారం అందుతోంది. ముఖ్యంగా డీజే టిల్లు సిద్దు జొన్నలగడ్డ చేసే తదుపరి సినిమాలో హీరోయిన్గా ఛాన్స్ నచ్చిందని టాక్ వినిపిస్తోంది. అయితే ఈ సక్సెస్ ఒక్కరోజులో వచ్చింది కాదని తృప్తి దిమ్రి కామెంట్ చేసింది. నాకు వచ్చిన క్రేజ్ క్రేజ్ వెనుక ఎన్నో కష్టాలు ఉన్నాయి అంటుంది.


కాగా కెరీర్ ప్రారంభంలో తృప్తి ఎన్నో సినిమాలు, వెబ్ సిరీస్ లలో నటించింది. అయితే ఏది కూడా సక్సెస్ కాలేదు. ఈ బ్యూటీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి పదేళ్లకు పైనే అవుతుంది. ఎన్నో ఆశలు పెట్టుకొని తృప్తి దిమ్రి నటించిన సినిమాలు నిరాశను మిగిల్చాయని, ఆ సమయంలో తాను చాలా బాధపడిందని, అంతేకాకుండా తన గుండెబద్దలు అయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయని తృప్తి చెప్పుకొచ్చింది.


కాగా, ఈ బ్యూటీ మొదట మోడల్ గా కెరీర్ ప్రారంభించి ఆ తర్వాత సినిమాల్లోకి అడుగుపెట్టింది. తృప్తి ముంబైలోని బాంద్రా కుర్రాడే సామ్ మర్చంట్. 2002లో గ్లాడ్రాగ్స్ మ్యాన్ హంట్ కాంటెస్ట్ లో గెలిచి మోడలింగ్ ప్రపంచంలో తనకంటూ మంచి పేరు సంపాదించుకుంది. ఇక ఈ బ్యూటీ మరిన్ని సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకోవాలని తన అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: