. . . ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . .

నట‌సింహం నందమూరి బాలకృష్ణ యాక్షన్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్లో వచ్చిన మూడో సినిమా అఖండ .. కరోనా తర్వాత టాలీవుడ్ కు ఊపు తీసుకొచ్చిన సినిమా కూడా ఇదే .. అలాగే బాలయ్య స్టామినాన్ని మరోసారి బాక్సాఫీస్ కి చూపించింది . ఇక ఈ సినిమా తర్వాత నుంచి బాలయ్య వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు . ఇక ఇప్పుడు తాజాగా ఈ సినిమాకు సిక్కులను కూడా ప్రారంభించాడు. అలాగే దానికి అఖండ తాండవం అనే టైటిల్ కూడా పెట్టారు .


సినిమా ని కూడా బోయపాటి భారీ యాక్షన్ డ్రామా గా తెర‌కెక్కించబోతున్నాడు . అలాగే బాలయ్య అఘోర పాత్ర మొదటి దానికంటే ఈసారి మరింత ఘాటుగా ఉండబోతుంది . అంతే కాకుండా ఈసారి బోయపాటి ఊహించని ప్లానింగ్ తో రాబోతున్నాడు . ఇదే సమయం లో టాలీవుడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు బోయపాటిసినిమా లో బాలయ్య తో పాటు మరో స్టార్ హీరో ని కూడా దించబోతున్నారట . ఇంత కీ ఆ హీరో మరెవరో కాదు మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమాలో గెస్ట్ రోల్ లో నటించబోతున్నారని అంటున్నారు .


ఇప్పటి కే బాలయ్య స్వర్ణోత్సవ వేడుక లో చిరంజీవి మాట్లాడుతూ నేను బాలయ్య కలిసి నటించడానికి రెడీ .. బోయపాటి కథ రెడీ చేసుకుని సవాల్ కూడా విసిరాడు .. ఇక అందుకు బోయపాటి కూడా సై అన్నాడు . అలాగే రీసెంట్గా జరిగిన ఓ ఈవెంట్లో కూడా బోయపాటి బాలయ్య - చిరు సినిమా పై ఆసక్తికర కామెంట్లు కూడా చేశాడు . ఇప్పుడు తాజా గా వస్తున్న సమాచారం మేరకు చిరంజీవి అఖండ 2 లో ప్రత్యేక పాత్ర లో కనిపించబోతున్నాడు . ఇక‌ త్వరలోనే దీనికి సంబంధించిన అధికార ప్రకటన కూడా రానుందని అంటున్నారు .

మరింత సమాచారం తెలుసుకోండి: