మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటించిన బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ ‘దేవర’.. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కించిన ఈ సినిమా సెప్టెంబర్ 27 న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ అయింది.. అయితే ఈ సినిమా మొదటి షో కు ప్రేక్షకుల నుండి మిక్స్డ్ టాక్ వచ్చింది.. కానీ రోజు రోజుకి టాక్ మారుతూ రావడం సినిమాకు బాగా ప్లస్ అయింది.. దీనితో ఈ సినిమా ఏకంగా 500 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి రికార్డ్ సృష్టించింది..ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ హాట్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించింది.. అలాగే బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ పవర్ ఫుల్ విలన్ పాత్రలో నటించి మెప్పించాడు.. ఈ సినిమాలో ఎన్టీఆర్ తండ్రి కొడుకులుగా డ్యూయల్ రోల్ లో అదరగొట్టాడు  తన యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్ లో వుంది.. అలాగే దేవర సినిమాలో మెయిన్ ఎసర్ట్ మ్యూజిక్.. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ ఈ సినిమాకు మ్యూజిక్ అందించాడు..

దేవర లో ప్రతి సాంగ్ ప్రేక్షకుడిని ఎంతగానో మెప్పించాయి.. ముఖ్యంగా చుట్టమల్లె సాంగ్ కి యూత్ ఫిదా అయిపోయింది.. దేవర సినిమాలో ఎన్టీఆర్ అదిరిపోయే ఎలివేషన్స్ కి అనిరుధ్ పవర్ ఫుల్ బిజిఏం అందించారు.. దేవరలో ఎన్టీఆర్ పెర్ఫార్మన్స్ తో పాటు అనిరుధ్ మ్యూజిక్ గురించి ప్రేక్షకులు మాట్లాడుకుంటున్నారు.. త్వరలోనే ఈ సినిమాకు సీక్వెల్ కూడా రాబోతుంది.. ఇదిలా ఉంటే దేవర పార్ట్ 1 మూవీ ఓటిటిలోకి వచ్చేందుకు సిద్ధం అయింది..దేవర డిజిటల్ రైట్స్‌ని ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ ఫ్యాన్సీ రేటుకు సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.ఇప్పటికే నవంబర్ 8న దేవరను నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ చేయనున్నట్లు సమాచారం. అయితే అంతకంటే ముందే దీపావళి కానుకగా స్ట్రీమింగ్ చేసే అవకాశాలు కూడా ఉన్నట్లు తెలుస్తుంది...

మరింత సమాచారం తెలుసుకోండి: