సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు ఏదైనా జరగొచ్చు అన్నదానికి ఎన్నెన్నో ఎగ్జాంపుల్స్  ఉన్నాయి. త్వరలోనే ఇండస్ట్రీలో స్థానాలు మారిపోతున్నాయి అంటూ ఒక యంగ్ డైరెక్టర్ చేస్తున్న పనులు చెబుతున్నాయి. మరీ ముఖ్యంగా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పుడు స్టార్ డైరెక్టర్ అనగానే అందరూ మొదటిగా చెప్పే పేరు ఎస్ఎస్ రాజమౌళి . అలాంటి ఒక చెరగని స్థానాన్ని ఇండస్ట్రీలో క్రియేట్ చేసుకున్నాడు . ఆయన సినిమా తెరకెక్కిస్తే  రికార్డ్స్ బ్లాస్ట్ అవ్వడమే కానీ ఆయన సినిమా ఫ్లాప్ అవ్వడం అంటూ జరగదు అన్న ఒక నమ్మకాన్ని క్రియేట్ చేసుకున్నాడు .


మరి ముఖ్యంగా ఇప్పుడు రాజమౌళి - మహేష్ బాబుతో తెరకెక్కించే  సినిమా కోసం చాలా స్థాయిలో కష్టపడుతున్నారు . ఈ సినిమాతో మరొక మెట్టు ఎక్కడమే రాజమౌళి పని అంటూ కూడా ఆయన ఫ్యాన్స్ ఓ రేంజ్ లో పొగిడేస్తున్నారు . అయితే ఇదే మూమెంట్లో రాజమౌళిని  త్వరలోనే డౌన్ చేసి నెంబర్ వన్ స్థానాన్ని అందుకోబోతున్నాడు యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ అంటూ  ఓ రేంజ్ లో మాట్లాడుకుంటున్నారు జనాలు.



దానికి కారణం ఆయన కమిట్ అవుతున్న సినిమాలు. ఆయన తెరకెక్కిస్తున్న సినిమాలు సూపర్ డూపర్ హిట్ అవుతున్నాయి. ఆయన మరెవరో కాదు "ప్రశాంత్ వర్మ". ఈయన ప్రజెంట్ ఎంత మంది స్టార్స్ తో కమిట్ అయ్యి ఉన్నాడో మనకు తెలుసు.  ఆ తర్వాత బడా స్టార్స్ ని లైన్లో పెట్టడం ప్రారంభించాడు.  అంతేకాదు ఏకంగా బాలయ్య కొడుకు మోక్షజ్ఞ డేబ్యూ మూవీ ప్రశాంత్ వర్మ ఖాతాలో పడింది . బాలయ్య లాంటి సీనియర్ స్టార్ హీరో తన కొడుకు డబ్బింగ్ ప్రశాంత్ వర్మ చేతిలో పెట్టాడు అంటే ఆయనపై ఎంత నమ్మకం పెట్టుకున్నాడీ అర్థం చేసుకోవచ్చు .



అయితే ఇప్పుడు ప్రభాస్ తో కూడా ఒక సినిమాకి కమిట్ అయ్యాడు ప్రశాంత్ వర్మ అంటూ టాక్ వినిపిస్తుంది . అంతేకాకుండా జూనియర్ ఎన్టీఆర్ తో కూడా ఒక సినిమాకి చర్చలు జరుపుతున్నాడు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి . ఇలా బ్యాక్ టు బ్యాక్ అందరూ బడా స్టార్స్ తోనే కమిట్ అవుతున్నాడు ప్రశాంత్ వర్మ . ఈ సినిమాలన్నీ హిట్ అయితే నో డౌట్ ప్రశాంత్ వర్మ నెంబర్ వన్ స్థానంలోకి రావడం రాజమౌళి నెంబర్ 2 కి వెళ్లడం  అంటున్నారు ప్రశాంత్ వర్మ ఫ్యాన్స్ . అయితే జక్కన్న ఫ్యాన్స్ మాత్రం ప్రశాంత్ వర్మ అంత తోఫుగాడా..? అంటూ ట్రోల్ చేస్తున్నారు. చూద్దాం మరి ఫ్యూచర్ లో ఏం జరుగుతుందో..????

మరింత సమాచారం తెలుసుకోండి: