అయితే చాలామంది జనాలు ఎప్పుడూ ఆమె మోడ్రెన్ బట్టల్లోనే ఆకట్టుకుంటుంది అని ఆమెకు మన సంప్రదాయాలు తెలియవని ..చాలా సందర్భాలలో ట్రోళ్ చేశారు . అలాంటి వాళ్ళ నోరు మూయించే పని చేసింది బన్నీ భార్య స్నేహారెడ్డి. దీంతో ఆమె పేరు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది. స్నేహ రెడ్డి తాజాగా తన ఇంస్టాగ్రామ్ వేదికగా కొన్ని ఫొటోస్ షేర్ చేసింది. ఆ ఫొటోస్ చూసిన జనాలు ఆమెను ఓ మహాలక్ష్మి గా కామెంట్స్ చేస్తున్నారు.
చక్కగా .. అందంగా.. ట్రెడిషనల్ గా ఉన్నావు అంటూ కామెంట్స్ పెడుతున్నారు , రెడ్ కలర్ శారీలో చాలా పద్ధతిగా మన సాంప్రదాయాన్ని గౌరవిస్తున్న అమ్మాయిగా కనిపించింది స్నేహ రెడ్డి . తలలో పూలు చేతికి గాజులు.. ముఖాన కుంకుమ పెట్టుకొని నిండు ముత్తైదువుల దర్శనం ఇచ్చింది . స్నేహారెడ్డి ని ఎప్పుడు మోడ్రన్ దుస్తులోనే చూస్తూ విసిగిపోయిన జనాలకు ఈ సరికొత్త లుక్స్ బాగా ఆకట్టుకునేలా చేసింది. నేడు అట్లతద్ది సందర్భంగా ఆమె ట్రెడిషనల్ గా రెడీ అయ్యి ఉదయాన్నే లేచి పద్ధతిగా పూజ చేసి అట్లతద్ది పండుగను జరుపుకుంది . దానికి సంబంధించిన ఫొటోస్ ను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది. ఆ ఫొటోస్ బాగా ట్రెండ్ అవుతున్నాయి. దీంతో బన్నీ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. వదినమ్మ అంటూ ముద్దుగా పిలుస్తున్నారు..!!