దగ్గుబాటి వెంకటేష్..ఇండస్ట్రీలో అందరూ విక్టరీ వెంకటేష్ అని పిలుస్తూ ఉంటారు. ఎలాంటి జానర్ లో వచ్చే సినిమాలోనైనా సరే చాలా అద్భుతంగా నటించగలరు. ఈయన సినిమాలు ఎక్కువగా కుటుంబ కథా ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి.అయితే అలాంటి వెంకటేష్ వరుసకు చెల్లెలు అయ్యే హీరోయిన్ తో రొమాన్స్ చేశారట.మరి ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు ఎందుకు వెంకటేష్ అలాంటి పని చేశారు అనేది ఇప్పుడు చూద్దాం.. వెంకీ రొమాన్స్ చేసింది ఎవరితోనో కాదు అక్కినేని అమలతో.. అవును మీరు వినేది నిజమే.. ఎందుకంటే అక్కినేని అమల నాగార్జునని పెళ్లి చేసుకోక ముందే చాలా మంది హీరోలతో రొమాన్స్ చేసింది. ఇక ఈమె సౌత్ లో స్టార్ హీరోయిన్  గా రాణించిన సమయంలో వెంకటేష్ తో కూడా నటించింది.నాగార్జునతో పరిచయం కాకముందే వెంకటేష్ నటించిన రెండు మూడు సినిమాల్లో అవకాశాలు వచ్చాయి.

 అలా వెంకటేష్ అమల ఇద్దరు కలిసి  అగ్గి రాముడు, రక్త తిలకం వంటి రెండు సినిమాల్లో నటించారు. వీరిద్దరూ కలిసి ఈ సినిమాలో నటించిన సమయంలో వీరి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీకి చాలామంది ఫిదా అయ్యారు. అయితే ఇదే సమయంలో అక్కినేని నాగార్జునతో ప్రేమలో పడి ఆయన్ని పెళ్లి చేసుకోవాలని రెడీ అయిపోయింది. అయితే ఆ టైంలో అక్కినేని అమలతో వెంకటేష్ కి మరో సినిమాలో చేసే అవకాశం కూడా వచ్చిందట. కానీ అప్పటికే నాగార్జున ని పెళ్లి చేసుకోవాలనుకున్న అమల వెంకటేష్ తనకి వరుసకి అన్నయ్య అవుతాడు అనే విషయం తెలుసుకొని ఆ సినిమాని రిజెక్ట్ చేసిందట.

అమల రిజెక్ట్ చేయడంతో ఆ సినిమాలో మరో హీరోయిన్ ని తీసుకున్నారు.అలా వెంకటేష్ తనకి వరసకు చెల్లెలయ్యే అక్కినేని అమలతో సినిమాలో రొమాన్స్ చేశారు. అయితే సినిమా ఇండస్ట్రీలో ఇలాంటివన్నీ పట్టించుకోరు. వావి వరసలు లేకుండానే సినిమాల్లో నటిస్తూ ఉంటారు. ముఖ్యంగా వరుసకు అన్న చెల్లెలు అయిన వాళ్లు కూడా రొమాంటిక్ సన్నివేశాల్లో నటించిన సెలబ్రిటీలు ఉన్నారు.అలా ఇండస్ట్రీ అన్నాక బంధాలు బంధుత్వాలు వంటి వాటి గురించి పట్టించుకోరు

మరింత సమాచారం తెలుసుకోండి: