రెబల్ స్టార్ కృష్ణంరాజు నటవరసుడిగా ఈశ్వర్ సినిమాతో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చాడు ప్రభాస్.. మొదటి సినిమాతోనే ప్రేక్షకులను మెప్పించడంలో విప్లమయ్యాడు.. ఆ తర్వాత రాఘవేంద్ర టైటిల్ తో యాక్షన్ ఎంటర్టైనర్ చేశాడు. ఈ మూవీ కూడా ప్రభాస్‌కు నిరాశ మిగిల్చింది. ఆ తర్వాత వచ్చిన వర్షం సినిమాతో తొలి బ్లాక్ బస్టర్ అందుకున్నాడు ప్రభాస్.. త్రిష హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో గోపీచంద్ విలన్ గా చేశాడు... దర్శకుడు శోభన్ రొమాంటిక్ ప్రేమ కథగా తెర‌కెక్కించాడు.. ఆ తర్వాత రాజమౌళి డైరెక్షన్లో వచ్చిన చత్రపతి సినిమాతో ఇండస్ట్రీ హిట్‌ కొట్టి స్టార్ హీరోల జాబితాలో చేరాడు.


అలాగే ప్రభాస్ తన కెరియర్ల లవ్ అండ్‌ రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమాలను సైతం చేశాడు. అయితే నిజానికి అవి ఆయన ఇమేజ్కు భిన్నమైన సినిమాలు.. డార్లింగ్,  మిస్టర్ పర్ఫెక్ట్ , మిర్చి వంటి సినిమాలు ఈ కావలోకే వస్తాయి. అయితే మిర్చి సినిమాలో మాస్ యాక్షన్ అంశాలు కొంచెం ఎక్కువగా ఉంటాయి. ఇక డార్లింగ్ , మిస్టర్ పర్ఫెక్ట్ మాత్రం పక్క ఫ్యామిలీ ఎంటర్టైనేర్స్ ఈ సినిమాలతో ప్రభాస్ కి ఫ్యామిలీ ఆడియన్స్ లో కూడా మంచి క్రేజ్‌ పెరిగింది. అలాగే అమ్మాయిలు కూడా విపరీతంగా ఇష్టపడటం మొదలుపెట్టారు.


అయితే మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాని ప్రభాస్ చేయకూడదని మొదట అనుకున్నారట. ఇదే విషయాన్నికూడా నిర్మాత దిల్ రాజు ఓ ఇంటర్వ్యూలో కూడా చెప్పారు. అదే సమయంలో మలేషియాలో బిల్లా మూవీ షూటింగ్ జరుగుతుంది నేను దశరథ్ అక్కడికి వెళ్లి ప్రభాస్ కి కథ చెప్పాము ఆయనకు ఫస్ట్ అఫ్ బాగా నచ్చింది.. సెకండాఫ్ నచ్చలేదు.. అయినా సినిమాకు ఓకే చేశాడు.  అదే సమయంలో సినిమాని రిజెక్ట్‌ చేద్దామనుకున్నాడు ప్రభాస్ కానీ.. స్టోరీ అతను ఇంప్రెస్ చేయడంతో నేను ఈ మూవీ చేస్తానని దిల్ రాజుకు మాటిచ్చాడు.. ఆ మాట ప్రకారం ప్రభాస్ మిస్టర్ పర్ఫెక్ట్ మూవీని చేశాడు. ఈ సినిమాలో ప్రభాస్ కి జంటగా కాజాల్‌, తాప్సి నటించారు. 2011లో విడుదలైన ఈ సినిమా హిట్‌ టాక్ తెచ్చుకుని ప్రభాస్‌కు ఫ్యామిలీ ఆడియ‌న్స్‌లో మంచి పేరు తెచ్చిపెట్టింది.

మరింత సమాచారం తెలుసుకోండి: