పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నాడు . ఆయన చేసిన సినిమాల తో ఇండస్ట్రీలో గొప్ప విజయాలు కూడా సాధించడమే కాకుండా స్టార్ హీరోగా మారాడు. ఇక మెగాస్టార్ చిరంజీవి ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ కూడా ఇండస్ట్రీలో ఎంట్రి ఇచ్చాడు భారీ సక్సెస్ సాధిస్తూ పవర్ స్టార్ గా బారీ క్రేజ్‌ను సొంతం చేసుకున్నాడు. ఇలా ఒకే కుటుంబం నుంచి ఇద్దరు స్టార్ హీరోలు ఉండటం అనేది నిజంగా గొప్ప విషయమనే చెప్పాలి. ఇక వీరి తర్వాత రామ్ చరణ్ కూడా హీరోగా ఎంట్రీ వచ్చి ఆయన కూడా పాన్ ఇండియా హీరోగా దూసుకు పోతున్నాడు.

అయితే పవన్ కళ్యాణ్ కెరియర్ మొదట్లో చిరంజీవి సినిమాల విషయంలో తానే దగ్గరుండి చూసుకునేవారట. అలా చిరంజీవి ఓకే చేసిన సినిమాలన్నీ పవన్ కళ్యాణ్ కు మంచి విజ‌యాలు తెచ్చిపెట్టాయి.  అయితే ఒక  సందర్భంలో పవన్ కళ్యాణ్ చేసే సినిమాలన్నీ పక్కన పెట్టి డిఫరెంట్ కధలు ఎంచుకోవాలని ఉద్దేశంతో మంచి సినిమాలను చేయాలనుకున్నాడు.. అందులో భాగంగానే ఎస్ జె సూర్య డైరెక్షన్లో వచ్చిన నాని సినిమాని మొదట పవన్ కళ్యాణ్ చేయాలని భావించారట. అయితే అందుకు చిరంజీవిసినిమా చేస్తే ఆడదు అని సినిమా చేయొద్దని చెప్పాడట.  


ఇక దాంతో పవన్ కళ్యాణ్సినిమా చేయాలనే ఆలోచన విరమించుకున్నాడు. ఇక అప్పుడు సూర్య మహేష్ బాబుతో ఆ సినిమా చేసి భారీ డిజాస్టర్ అందుకున్నాడు. అలా భారీ డిజాస్టర్ నుంచి పవన్ కళ్యాణ్ తప్పించుకున్నాడని చెప్పాలి. అయితే ఆ సినిమా గురించి తెలుసుకున్న పవన్ కళ్యాణ్ చిరంజీవి వల్లే భారీ డిజాస్ట‌ర్‌ నుంచి తప్పుకున్నానని కూడా చెప్పుకుంటూ అది నా కెరియర్ కు చాలా ప్లస్ అయింది అని కూడా ఒక సందర్భంలో చెప్పుకొచ్చాడు. మరి మొత్తానికి నాని సినిమా మహేష్ బాబును  నిరాశపరిచింది. ఆ సినిమా చేయకపోవడం పవన్ కళ్యాణ్ కు మంచిదైందంటూ సినీ విమర్శకులు సైతం చెపుతూ ఉంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: