అక్కినేని అమల.. సౌత్ ఇండస్ట్రీ లో హీరోయిన్ గా ఎంతో మంది గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ అక్కినేని ఫ్యామిలీ లోకి కోడలుగా అడుగు పెట్టింది. అయితే అక్కినేని ఫ్యామిలీ లోకి కోడలుగా అడుగు పెట్టక ముందే అమలతమిళ హీరోని ప్రేమించింది. ఆ తమిళ హీరో తో పెళ్లి వరకు కూడా వెళ్ళింది. కానీ ఎందుకో వారిద్దరికీ మ్యాచ్ అవ్వలేదు. దాంతో ఇద్దరు బ్రేకప్ చెప్పుకున్నారు. అయితే అక్కినేని నాగార్జున ని అమల ప్రేమిస్తున్న సమయం లోనే మరో హీరో కూడా అమల ని తెగ ప్రేమించారట.ఇక ఆ హీరో ఎవరో కాదు. విలన్ పాత్రల్లో అద్భుతంగా నటించి తన విలనిజంతో ఎంతో మంది అభిమాలను సంపాదించుకున్న నటుడు రఘువరన్..

 అయితే ప్రస్తుతం ఈయన మన ముందు లేకపోయినప్పటికీ రఘువరన్ నటించిన సినిమాల ద్వారా ఆయన అభిమానుల గుండెల్లో ఎప్పటికి చెరిగిపోని ముద్ర వేసుకున్నారు. అయితే అలాంటి రఘువరన్ హీరోయిన్ రోహిణి ని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.కానీ ఈమె కంటే ముందే అక్కినేని అమలను చాలా గాఢంగా ప్రేమించారట. కానీ అమల కు ఈ విషయం చెప్పలేదు. ఇక అమల రఘువరన్ కాంబినేషన్లో కొన్ని సినిమాలు కూడా వచ్చాయి.ఆ సినిమాలు చేసే సమయంలోనే రఘువరన్ అమలని వన్ సైడ్ లవ్ చేశారట.

అయితే ఈ విషయం చెప్పే ధైర్యం చేయకపోవడం తో తన ప్రేమ విషయం అమలకు తెలియలేదు. ఇక రఘువరన్ తన ప్రేమ విషయాన్ని అమల కు చెప్పేలోపే  అమల నాగార్జున ప్రేమకి ఒకే చెప్పి వారిద్దరి పెళ్లి జరిగింది. అలా వీరిద్దరి పెళ్లి జరిగిన సమయం లో  రఘువరన్ చాలా డిప్రెషన్ లోకి వెళ్లారట. ఆ సమయంలో రోహిణి తో ప్రేమలో పడి పెళ్లి చేసుకున్నప్పటికీ ఆయన మనసంతా అమల మీదే ఉండేదని అప్పటి ఇండస్ట్రీ జనాలు గుసగుసలు పెట్టుకున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి: