నటరత్న ఎన్టీఆర్ తర్వాత ఆయన వారసుడు గా సినిమాల్లో అడుగుపెట్టి తండ్రి కి తగ్గ నటుడి గా పేరు తెచ్చుకొని ఎన్టీఆర్ చేయని పాత్రలు కూడా చేసి నటసింహం గా బిరుదు అందుకున్న బాలకృష్ణ ప్రస్తుతం టాలీవుడ్ లోనే క్రేజీ హీరోగా దూసుకుపోతున్నాడు . సినిమాల్లో నే కాకుండా రాజకీయాల్లో కూడా డబల్ హార్ట్రిక్ నాయకుడిగా పేరు తెచ్చుకున్నాడు. అలాగే బసవతారకం క్యాన్సర్‌ హాస్పిటల్ ద్వారా ఎందరో  నిరుపేదలకు దేవుడయ్యాడు. అలాంటి బాల‌య్య‌ అభిమానులకు ఇప్పుడు త్వరలోనే శుభవార్త విన బోతున్నారు.. ఇక పూర్తి వివరాలకు వెళితే ప్రతి సంవత్సరం రిపబ్లిక్ డే సందర్భంగా కేంద్ర ప్రభుత్వం తరఫున రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మా పుష్కరాలు అందజేసే విషయం అందరికీ తెలిసిందే.


వివిధ రంగాలకు చెందిన ప్రముఖ వ్యక్తులకు సేవలను గుర్తించి ఈ పుష్కరాలు ఇస్తూ ఉంటారు . ఈ సంవత్సరం మెగాస్టార్ చిరంజీవి కి పద్మ విభూషణ్ అవార్డు దక్కిన విషయం తెలిసిందే . అంతకు ముందు ఆయనకు పద్మభూషణ్‌ అవార్డు కూడా అందింది . అయితే ఇప్పుడు పద్మ పుష్కరాలను  కేంద్ర ప్రభుత్వం గుర్తించి ఇచ్చేవి కొన్ని ఉంటాయి .. అలాగే ఆయా రాష్ట్రాలకు చెందిన ప్రభుత్వాల సిఫార్సుల ను పరిగణించి ఇచ్చేవి కొన్ని ఉంటాయి .


అలా ఈ సంవత్సరం మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున  పద్మభూషణ్‌ అవార్డు కి గాను చిత్ర పరిశ్రమ నుంచి నందమూరి బాలకృష్ణ పేరుని ఎంపిక చేసి కేంద్రాని కి పంపబోతున్నారట . అలాగే మరో సీనియర్ నరుడు మురళీమోహన్ పేరుని కూడా సిఫార్సు చేయనున్నారట . ప్రస్తుతం టిడిపి కేంద్ర ప్రభుత్వం లో మిత్ర పక్షంలో ఉన్న విషయం తెలిసిందే కాబట్టి బాలయ్య బాబుకి పద్మభూషణ్ అవార్డు నూటికి నూరు శాతం ఖరారు అయినట్టే అని కూడా అంటున్నారు. మరి దీనిపై త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం కూడా అధికార ప్ర‌క‌ట‌న‌ చేయనుందట .
 

మరింత సమాచారం తెలుసుకోండి: