ఇక అక్కినేని ఫ్యామిలీకి సంబంధించి అభిమానులకు ఎప్పటినుంచో ఓ సందేహం ఉంటుంది.. అది ఎంటే అక్కినేని కుటుంబంలో దాదాపుగా అందరి పేర్లకు ముందు నాగ అని ఉంటుంది.. దీంతో ఈ విషయం చాలా మంది అభిమానులకు పెద్ద వింతగా అనిపిస్తుంది. అయితే దీనిపై గతంలో నాగార్జున క్లారిటీ కూడా ఇచ్చారు. తమ కుటుంబంలో అందరి పేర్లకు ముందు నాగాన్ని ఎందుకు ఉంటుందో కూడా చెప్పారు. ఆ కారణాలు ఏమిటో ఇక్కడ చూద్దాం.అక్కినేని నాగేశ్వరరావు కడుపులో ఉన్నప్పుడు ఆయన తల్లి గారికి కలలో ఎప్పుడు పాములు కనిపించవట.. దీంతో ఆమె భయపడి తన కొడుక్కి నాగేశ్వరరావు అని పేరు పెట్టారట. అయినప్పటికీ ఆమెకు తరచూ పాములు కనిపిస్తూ ఉండేవట.
ఇక దాంతో ఆమె నాగదేవతకు ప్రత్యేకంగా ఎప్పుడు పూజలు చేస్తూ ఉండేవారట. అలాగే తమ కుటుంబంలో పుట్టే పిల్లలకు నాగా అనే పేరు వచ్చేలా పెట్టాలని చెప్పారట. దాంతో నాగేశ్వరరావు తన కొడుకు నాగార్జునకు అలా పేరు పెట్టారని అంటారు. ఆ తర్వాత నాగార్జున కూడా నాగ అని వచ్చేలా నాగచైతన్యకు పేరు పెట్టారు. ఇదే విషయాన్నినాగార్జున గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పరు. అంతేకాకుండా అఖిల్ విషయంలో మాత్రం అలా ఎందుకు చేయలేదు అంటే మొదటి సంతానానికి మాత్రమే అలా పేరు పెట్టాలని చెప్పారట. దానికి కారణం గానే వారికి నాగ అనే పేరు మొదట వచ్చింది.. ఇది ఈ విషయం వెనక ఉన్న అసలు రహస్యం ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.