అసలైన మెగాస్టార్ మంచు విష్ణు.. ఇప్పుడు ఎక్స్ లో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఓ రేంజ్ లో వైరల్ చేస్తున్న పోస్ట్ ఇదే. మంచు విష్ణు హీరోగా వస్తున్న కన్నప్ప మూవీ రీల్స్ ను షేర్ చేస్తూ.. ఇతనే అసలైన మెగాస్టార్ అంటూ ఓ రేంజ్ లో ఆడుకోవడం మొదలుపెట్టారు ఎన్టీఆర్ ఫ్యాన్స్. అసలు మేటర్ లోకి వెళితే దేవర సినిమాపై కొరటాల మీదున్న మొత్తం పగను మెగా ఫాన్స్ చూపించారు.. సినిమాను ట్రోల్ చేసి అసలు వరస్ట్, డిజాస్టర్, అంటూ సోషల్ మీడియాలో ఎన్టీఆర్‌ను టార్గెట్ చేస్తూ వచ్చారు, ఎన్టీఆర్ కు రామ్ చ‌రణ్ కు మంచి స్నేహం ఉన్నా సరే మెగా అభిమానులు ఎక్కడ వదిలిపెట్టలేదు. ఇక కొరటాల శివ కారణంగానే ఆచార్య డిజాస్టర్ అయిందని అయినా కోర‌టాల మాత్రం ఆ పాపాన్ని మొత్తం చిరంజీవి మీదకు నెట్టారని  ఫ్యాన్స్ ఫైర్ అయ్యారు. అందుకే దేవర రిలీజ్ సమయంలో పాధఘట్టం2 అంటూ పోస్ట్ లు  వైరల్ చేశారు.


రాజమౌళి సెంటిమెంటును ఎవడు బ్రేక్ చేయలేడు అని ఎన్టీఆర్‌కు ఫ్లాఫ్ పడింది అంటూ కామెంట్లు కూడా చేశారు . కానీ దేవర అన్నిటినీ బాధలు కొట్టుకుంటూ బాక్సాఫీస్ పై దండయాత్ర చేసింది. ఇలా మెగా అభిమానులకు దేవర కలెక్షన్లతో చెక్కులు చూపించింది. ఇప్పుడు గేమ్ చేంజర్ సినిమా విడుదల దగ్గర పడుతుంది అదే టైంలో మెగాస్టార్ చిరంజీవి విశ్వంభ‌రా కూడా ఉంది. కొడుకు కోసం మెగాస్టార్ తన సినిమాను వాయిదా వేసుకున్నారు ఇప్పుడు దేవ‌ర‌ హిట్ అయింది కాబట్టి ఎన్టీఆర్ ఫ్యాన్స్ వంతు వచ్చింది.. అందుకే ఇప్పుడు సోషల్ మీడియాలో వార్‌ డిక్లేర్ చేశారు. ఈ సినిమా విడుదలకు ఎలా అయితే దేవ‌ర‌ని టార్గెట్ చేశారో అందుకు డబుల్ ట్రీట్మెంట్ను ఎన్టీఆర్ ప్యాన్స్‌ ప్లాన్ చేశారు.. ఏకంగా మెగా ఫ్యామిలీలో మెగాస్టార్ లేడని రియల్ మెగాస్టార్ మంచు విష్ణు అంటూ ట్రోల్ చేయటం ప్రారంభించారు.


దానికి కారణం కూడా లేకపోలేదు.. కన్నప్ప సినిమాకు పలికిన ఓటీటీ రేట్.. అవును కన్నప్ప సినిమా ఓటీటీలో 57 కోట్లకు అమ్ముడుపోయింది. అలాగే గేమ్ చేంజర్ 50 కోట్లకు మాత్రమే కొన్నారు. ఇక ఆచార్య సినిమా వరల్డ్ వైడ్ గా వసూలు చేసింది 48 కోట్లు మాత్రమే. అలాగే బ్రో సినిమా వరల్డ్ వైడ్ గా చేసింది 54 కోట్లు. అందుకే రియల్ మెగాస్టార్ మంచు విష్ణు అని… కన్నప్పతో షేక్ చేయడానికి రెడీ అయ్యాడని, మెగా ఫ్యామిలీ పక్కకు తప్పుకోవాలంటూ ట్రోల్ స్టార్ట్ చేసారు. ఇప్పుడే ఈ రేంజ్ లో మొదలుపెడితే గేమ్ చేంజర్ రిలీజ్ టైం కి బొమ్మ ఎలా ఉంటుందో చూడాలి. రిజల్ట్ అటు ఇటు అయితే మెగా ఫ్యామిలీకి కాళ రాత్రులే అంటున్నారు సినిమా జనాలు.

మరింత సమాచారం తెలుసుకోండి: