టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది క్యారెక్టర్ ఆర్టిస్టులుగా ఉన్నప్పటికీ.. హీరోయిన్స్ లెవల్లో నటిగా పేరు పొందిన వారిలో నటి సత్య కృష్ణన్ కూడా ఒకరు. ఈమె తెలుగు సినీ పరిశ్రమలోనే సుమారుగా 60 కి పైగా చిత్రాలలో నటించినది. ముఖ్యంగా పలు చిత్రాలలో తన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. నటి సత్య కృష్ణన్ వాయిస్ లో బేస్ ఉండడం వల్ల ఈమెకు బాగా కలిసి వచ్చిందని చెప్పవచ్చు. ఒకప్పుడు ఎన్నో చిత్రాలలో నటించిన సత్య కృష్ణన్ ఈ మధ్యకాలంలో పెద్దగా కనిపించడం లేదు.


సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉన్నప్పటికీ తాజాగా సత్య కృష్ణ న్ కూతురు కూడా ఇండస్ట్రీలోకి హీరోయిన్గా ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. ఈమె కూతురు పేరు అనన్య కృష్ణన్. తెలుగులో ఇమే గ్యాంగ్ స్టార్ గంగరాజు అనే చిత్రంలో కూడా కీలకమైన పాత్రలో నటించింది. ఇదే కాకుండా మరో సినిమాలో కూడా నటించింది  ఇప్పుడు తాజాగా జబర్దస్త్ రాకేష్ నటించిన కెసిఆర్ చిత్రంలో అనన్య హీరోయిన్గా నటిస్తున్నదట. అలా హీరోయిన్ గా పరిచయం కాబోతున్న అనన్య ఇటీవలే ట్రైలర్స్ కూడా విడుదల కాగా బాగా ఆకట్టుకుంటోంది.


అయితే ఈ విషయం తెలిసిన చాలా మంది నెటిజన్స్ ఆశ్చర్యపోతున్నారు. ఏంటి నటి సత్య కృష్ణన్ కు ఇంత పెద్ద కూతురు ఉందా అంటూ ఆశ్చర్యపోతున్నారు. మరి ఏ మేరకు కేసీఆర్ సినిమాతో సక్సెస్ అయి ఇండస్ట్రీలో అవకాశాలను అందుకుంటుందో చూడాలి మరి. సోషల్ మీడియాలో కూడా అనన్యకు బాగానే ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆమెకు సంబంధించిన ఫోటోలు కూడా తెగ హల్చల్ చేస్తున్నాయి. సత్య కృష్ణన్ కూడా ఇప్పటికీ పలు చిత్రాలలో నటిస్తూనే ఉన్నది. సత్య కృష్ణన్ కూతురుకి ఇండస్ట్రీలో అవకాశాలు రావడానికి ఆమె తల్లి సపోర్టు కూడా ఉన్నదట. మరి అనన్య సక్సెస్ అవుతుందో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: