సూర్య తో జై భీమ్ వంటి సందేశాత్మక సినిమాను తెరకెక్కించి విమర్శకుల ప్రశంసలు అందుకున్న దర్శకుడు టీజే జ్ఞానవేల్ ఈ సినిమాకి దర్శకుడు. వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ సినిమాని తెరకెక్కించారు. దసరా కానుకగా ఈ సినిమా అక్టోబర్ 10వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ వేట్టయన్ బాక్సాఫీస్ విజయం అంతంత మాత్రంగానే ఉంది. వేట్టయన్ పెద్దగా విజయాన్ని అందు కోలేదు. ఈ సినిమా మొదటి వారంలో ప్రపంచవ్యాప్తంగా రూ. 207 కోట్లను మాత్రమే రాబట్టింది.
అంచనాలకు తగినట్లుగా మంచి ఫలితం కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న ప్రస్తుత కాలంలో పోటీ సినిమాలు రిలీజ్ కి రానున్నాయి. కనుక ఈ సినిమా విజయం సాధ్యం కాదని అంచనా వేస్తున్నారు. ఈ సినిమా ఫలితంతో ఇప్పుడు రజనీకాంత్ లైకా సంస్థతో ఏవో కొన్ని ఒప్పందాలు చేసుకుంటున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.
వేట్టయన్ ఆర్థిక వైఫల్యం నుండి కోలుకునే సమయంలో భాగంగా లైకా ప్రొడక్షన్స్ తమకోసం మరొక సినిమాలో నటించడానికి సంప్రదింపులు చేసినట్లు ఓ మీడియా ఛానల్ నివేదికలో వెల్లడించారు. అంతేకాకుండా తదుపరి ప్రాజెక్టు కోసం వారి పారితోషికాన్ని తగ్గించుకోవాలని కూడా రజనీకాంత్ ని లైకా సంస్థ కోరినట్లు ఓ జాతీయ మీడియా ఛానల్లో వెల్లడించారు. ప్రస్తుతం ఈ వార్త వైరల్ అవుతుంది. మరి దీని పై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.