కుర్ర హీరోగా టాలీవుడ్ లో పేరుపొందిన హీరో తేజ సజ్జా.. ఎప్పుడు కూడా విభిన్నమైన పాత్రలతో కథతో ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నారు. ఇటీవలే హనుమాన్ సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో మంచి పేరు సంపాదించారు. దీంతో ఒక్కసారిగా తన క్రేజ్ పెరిగిపోయింది. తాజాగా  తేజ సజ్జా మిరాయ్ అనే చిత్రంలో కూడా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని డైరెక్షన్ వహిస్తూ ఉన్నారు. అలాగే ఇందులో మొదటిసారిగా మంచు మనోజ్ ఒక కీలకమైన పాత్రలో నటిస్తున్నారు.


టాలీవుడ్ బడా బ్యానర్ గా పేరు పొందిన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై ఈ సినిమాని నిర్మిస్తున్నారు.. ప్రస్తుతం మిరాయ్ సినిమా షూటింగ్ కూడా శరవేగంగా జరుపుకుంటోంది. ఇటీవలే చిత్ర బృందం కూడా శ్రీలంకలో షెడ్యూల్ షూట్ చేస్తున్నట్లు సమాచారం. ఇక్కడే యాక్షన్ ఎపిసోడ్ సన్నివేశాలు షూట్ చేస్తున్నట్లుగా గత రెండు రోజులకు పలు రకాలు లీక్కులు అయితే వైరల్ గా మారుతున్నాయి. అయితే ఇందులో ఎటువంటి డూప్ లేకుండా యాక్సిడెంట్ సన్నివేశాలలో తేజా సజ్జా నటిస్తూ ఉన్నట్లు సమాచారం.


ఇలాంటి సమయంలోనే హీరో తేజ సజ్జా శ్రీలంక షెడ్యూల్ ని ముగించుకొని హైదరాబాద్ ఎయిర్పోర్టులో వస్తూ ఉండగా ఒక వీడియో వైరల్ గా మారుతోంది .అందులో తేజ ఎడమ చేతికి కట్టుతో కనిపించారు. దీంతో ఒక్కసారిగా అభిమానులు తేజ సజ్జా కి ఏమైందా అని ఆరా తీయగా.. మిరాయ్ సినిమా షూటింగ్లో గాయపడినట్లుగా తెలుస్తోంది. అయితే ఇది చిన్న గాయంగానే కనిపించిన వైద్యులు రెండు రోజులు రెస్ట్ తీసుకోమన్నారట. త్వరలోనే మరొక షెడ్యూల్ లో పాల్గొనబోతున్నట్లు సమాచారం. తేజ సజ్జ నటిస్తున్న మిరాయ్ చిత్రం ఏకంగా 8 భాషలలో విడుదల చేయబోతున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 18న రిలీజ్ చేసే విధంగా చిత్ర బృందం ప్లాన్ చేస్తోంది. అయితే మొత్తానికి తేజ సజ్జా ఈ ప్రమాదం నుంచి బయటపడడంతో అభిమానులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: