ఈ సినిమాలో డ్యూయల్ రోల్ లో బాలయ్య నట విశ్వరూపం చూపించారు. ఇంటర్వెల్ లో బాలయ్య పోషించిన మరో పాత్ర ఎంట్రీతో సినిమా రేంజ్ పెరిగింది. ఈ సినిమాలో ఇంటర్వెల్ ఫైట్ సీన్ కు ఏ రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. లెజెండ్ సినిమాకు సీక్వెల్ వచ్చినా హిట్టవుతుందని బాలయ్య అభిమానులు భావిస్తుండటం గమనార్హం.
స్టార్ హీరో బాలకృష్ణ ఒక్కో మెట్టు కెరీర్ పరంగా ఎదిగి ఈ స్థాయికి చేరుకున్నారు. లెజెండ్ సినిమా అప్పట్లోనే రికార్డ్ స్థాయిలో కలెక్షన్లను సాధించింది. 14 రీల్స్ బ్యానర్ పై తెరకెక్కిన ఈ సినిమా నిర్మాతలకు సైతం మంచి లాభాలను అందించింది. లెజెండ్ సినిమాతో జగపతిబాబు విలన్ గా కెరీర్ ను మొదలుపెట్టారు. ఈ సినిమాలో జగపతిబాబు విలనిజానికి సైతం ఎంతోమంది అభిమానులు ఉన్నారు.
ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన తర్వాత జగపతిబాబు కెరీర్ పరంగా వెనక్కు తిరిగి చూసుకోవాల్సిన అవసరం అయితే రాలేదనే చెప్పాలి. లెజెండ్ మూవీకి పరిమితంగా రెమ్యునరేషన్ తీసుకున్న బాలయ్య ఇప్పుడు ఆ సినిమాలతో పోల్చి చూస్తే 4 రెట్లు ఎక్కువ మొత్తం రెమ్యునరేషన్ ను బాలయ్య అందుకుంటున్నారు. బాలయ్య భవిష్యత్తు సినిమాలు సైతం భారీ రేంజ్ లో తెరకెక్కుతున్నాయి.