* నటనలో తోపు చిరంజీవి

* స్నేహం కోసం సినిమాలో గొప్పగా ద్విపాత్రాభినయం

* స్నేహం విలువ చెప్పే ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్

(ఏపీ - ఇండియా హెరాల్డ్)

1999లో విడుదలైన ‘స్నేహం కోసం’ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి ద్విపాత్రాభినయం చేయడం ప్రేక్షకులని బాగా ఆకట్టుకుంది. చిరు ఒక పాత్రలో పేదవాడు, ధనవంతుడికి క్లోజ్ ఫ్రెండ్ గా నటించాడు. అదే సింహాద్రి పాత్ర. ఇంకో పాత్రలో చిన్నయ్య అంటే సింహాద్రి కుమారుడిగా నటించి మెప్పించాడు. చిరంజీవి ఒక పాత్రలో వయసు పైబడిన వ్యక్తి లాగా కనిపించాడు. మరొక పాత్రలో యంగ్‌స్టర్ లాగా చేశాడు ఈ రెండు పాత్రలలో కూడా ఆయన చూపించిన డిఫరెన్స్ అనేది చాలా స్పష్టంగా కనిపించింది. రెండు పాత్రలో నటించింది ఒక్క చిరంజీవియే అయినా వేరు వేరు వాటిలో నటించారు అనుకునే అంతలా ఆయన అద్భుతంగా నటించాడు. స్నేహం ఎంతటి కష్టాలనైనా ఎలా అధిగమించగలదో ఈ సినిమా చక్కగా చూపిస్తుంది.

సింహాద్రి పాత్రలో చిరు దయగల గ్రామస్థుడు, ప్రభాకర్ ఇంట్లో పనిమనిషిగా కనిపించాడు. అతను తన యజమాని పట్ల చాలా నిజాయితీగా ఉంటాడు. అతనిని నిజమైన స్నేహితుడిగా భావిస్తాడు. ప్రభాకర్ జీవితంలో ఇబ్బందులు తలెత్తినప్పుడు, సింహాద్రి తన స్నేహితుడిని రక్షించడానికి, విషయాలను సరిదిద్దడానికి అడుగులు వేస్తాడు. చిరు డ్యూయల్ రోల్స్‌లో పలికించిన ఎమోషన్స్ అందర్నీ ఆకట్టుకున్నాయి. ఆవేశంతో రగిలిపోయాయి చిన్నయ్య లాగా, చాలా అనుభవం సంపాదించే ప్రశాంతంగా కనిపించే సింహాద్రి లాగా అతను బాగా నటించాడు. ఈ సినిమాతో చిరంజీవి అంత గొప్ప నటుడు అందరికీ అర్థం అయింది.

మూవీ స్టోరీ చాలా ఎమోషనల్ గా ఉంటుంది ఒక ఫ్రెండ్ తన ఫ్రెండ్ కోసం జైలుకు కూడా వెళ్తాడు. తన ప్రాణాలను సైతం ఇవ్వడానికి రెడీగా ఉంటాడు ఆ బరువైన సన్నివేశాలు మనకు కన్నీళ్లు తెప్పించక తప్పవు. ఇది ఫ్రెండ్స్ అందరూ కలిసి చూడాల్సిన ఒక గొప్ప కళాఖండం. ఇదొక ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టదు. ఇందులోని పాటలు కూడా చాలా బాగుంటాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: