మన తెలుగు సినీ పరిశ్రమలో ఒకే సినిమాలో రెండు పాత్రలు , మూడు పాత్రలలో నటించిన హీరోలు ఎంతో మంది ఉన్నారు. అలా రెండు పాత్రల ద్వారా ప్రేక్షకులను ఆకట్టుకున్న సీనియర్ స్టార్ హీరోలలో విక్టరీ వెంకటేష్ ఒకరు. ఈయన చాలా సినిమాల్లో రెండు పాత్రలో నటించాడు. అందులో కొన్ని సినిమాల్లో తన అద్భుతమైన నటనతో రెండు పాత్రలలోనూ చాలా వ్యత్యాసాలను చూపిస్తూ నటించిన సినిమాలు కూడా చాలానే ఉన్నాయి. అలాంటి సినిమాలలో సూర్యవంశం మూవీ ఒకటి. ఈ మూవీ లో వెంకటేష్ రెండు పాత్రలలో కనిపించాడు.

ఈ సినిమాలో వెంకటేష్ ఒక పాత్రలో తండ్రిగానూ , మరొక పాత్రలో కొడుకు గానూ నటించాడు. ఇక తండ్రి పాత్రలో ఒక రకమైన నటనతో , కొడుకు పాత్రలో మరో రకమైన నటనతో వెంకటేష్ ఈ రెండు పాత్రలలో తన నటనతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు. ఇక ఈ సినిమాలో తండ్రి పాత్రలో నటించిన వెంకటేష్ కు జోడిగా రాధిక నటించగా ... కొడుకు పాత్రలో నటించిన వెంకటేష్ కు మీనా జోడిగా నటించింది. భీమినేని శ్రీనివాసరావు దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాకు ఎస్ ఏ రాజ్ కుమార్ సంగీతాన్ని అందించాడు. 1998 వ సంవత్సరం విడుదల అయిన ఈ సినిమాను సూపర్ గుడ్ ఫిలిమ్స్ బ్యానర్ పై ఆర్ బి చౌదరి నిర్మించాడు.

మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ సక్సెస్ అయింది. అలాగే ఈ మూవీ లోని వెంకటేష్ నటనకు ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి అద్భుతమైన ప్రశంసలు దక్కాయి. అద్భుతమైన ఫ్యామిలీ కథాంశంతో రూపొందిన ఈ సినిమాకు ఆ సమయంలో ఫ్యామిలీ ఆడియన్స్ నుండి అద్భుతమైన గుర్తింపు లభించింది. అలాగే ఈ మూవీ కి అద్భుతమైన కలెక్షన్లు బాక్సాఫీస్ దగ్గర లభించాయి. అలా సూర్యవంశం సినిమా వెంకటేష్ కెరియర్ లోనే ఒక అద్భుతమైన మూవీ గా మిగిలిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: