•ఓకే సినిమాలో 45 పాత్రలతో రికార్డ్..

•కమలహాసన్ కూడా బ్రేక్ చేయలేకపోయారే

•జాన్సన్ జార్జ్ రికార్డ్ చెరిపే వారే లేరా..

ఇండియన్ సినీ పరిశ్రమలో అమితాబ్ బచ్చన్, సీనియర్ ఎన్టీఆర్, కమలహాసన్, చిరంజీవి, ఏఎన్ఆర్, కృష్ణ ఇలా ఎంతో మంది లెజెండ్రీ యాక్టర్స్ కూడా ఉన్నారు. వీరందరూ కూడా చాలా గొప్ప గొప్ప పాత్రలలో నటించారు. అయితే  ఓకే సినిమాలో ఎక్కువ పాత్రలు చేసిన నటుడు ఎవరంటే కచ్చితంగా కమలహాసన్ పేరే అందరూ చెబుతూ ఉంటారు. కానీ ఒకే చిత్రంలో కమల్ హాసన్ కంటే ఎక్కువ పాత్రలలో నటించిన మరొక నటుడు ఉన్నారు. ఆయన ఏకంగా ఒకే చిత్రంలో 45 పాత్రలు పోషించడం గమనార్హం. మరి ఆ నటుడు ఎవరు? ఏ సినిమాలో నటించారు? ఇప్పుడు ఒకసారి చూద్దాం.


చాలా మంది కమలహాసన్ దశావతారం చిత్రంలో పది పాత్రలలో నటించారు. ఈయనే ఎక్కువ పాత్రలు చేసిన నటుడు అని అనుకుంటూ ఉంటారు. ఈ పాత్రలు అన్నీ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. అయితే కమలహాసన్ ని మించిన పాత్రలలో నటించిన మరో నటుడు ఎవరంటే జాన్సన్ జార్జ్. ఈయన మలయాళ నటుడు అయినప్పటికీ ఎన్నో చిత్రాలలో నటించారు. 2018 లో విడుదలైన అరును జాన్ అనే చిత్రంలో జాన్సన్ జార్జ్ ఏకంగా 45 పాత్రలలో నటించారట. ఈ విషయం అప్పట్లో హాట్ టాపిక్ గా మారింది. ఇన్ని పాత్రలకు మేకప్ ఎలా వేసుకున్నారు అంటూ అందరూ ఆశ్చర్యపోయారు.


వివేకానంద, గాంధీ, జీసస్, హిట్లర్ తదితర పాత్రలలో సుమారుగా 45 పాత్రలలో పోషించారు. అది కూడా కేవలం ఒకే చిత్రంలోనే ఇన్ని పాత్రలు పోషించడంతో గిన్నిస్ రికార్డు ఎక్కినట్లుగా తెలుస్తోంది. ఇలా ఎంతోమంది దిగ్గజ నటులు సైతం చెరపలేని రికార్డును జాన్సన్ జార్జ్ తన పేరిట నిలుపుకున్నారు. మరి రాబోయే రోజుల్లో ఈ నటుడి రికార్డును సైతం ఏ హీరో అయినా బ్రేక్ చేస్తారేమో చూడాలి మరి. ఏది ఏమైనా ఏకంగా 45 పాత్రలతో ఒకే సినిమాలో నటించడం అంటే ఎంత కష్టపడి ఉంటారో అర్థం చేసుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: