కొంతమంది తమ ప్రేమను కొన్ని విధాలుగా ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటారు . ఒకసారి పువ్వు ఇచ్చి.. మరొకసారి ముద్దు పెట్టి ..మరొకసారి గిఫ్ట్ ఇచ్చి.. మరొకసారి తమ ఫేవరెట్ పర్సన్స్ పేర్లను తమ ఒంటిపై టాటూ వేయించుకుని . ఇలా ఒక్కొక్కరిది ఒక్కొక్క విధమైన ప్రేమ తెలిపే రూట్ ఉంటుంది . అయితే చాలామంది మాత్రం తమ ప్రేమను సింపుల్గా చెప్పుకొస్తూ ఉంటారు . ఎక్కువుగా ఆడంబరాలు చేయరు. వాళ్ళల్లో ఒకరే మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.


ఆయన ప్రసెంట్ పోజీషన్ ఏంటో మనకు బాగా తెలుసు. ఆయన ఓ పక్క పరసనల్ లైఫ్ ని మరొక పక్క ప్రోఫిషినల్ లైఫ్ ని చక్కగా ముందుకు తీసుకెళ్తున్నాడు. ఆయనకు ఉపాసన అంటే ఎంత ఇష్టమో మనకు తెలుసు. ఉపాసన అంటే రామ్ చరణ్ కు విపరీతమైన ఇష్టం - ప్రేమ - ప్రాణం.  ఆమె కోసం ఏమైనా చేస్తాడు.  ఎంతలా అంటే అసలు ఆయనకి ఇష్టం లేని పచ్చబొట్టును కూడా ఉపాసన కోసం పొడిపించుకున్నాడు .



ఉపాసన సరదాగా అడిగిన ఒక మాటను నిజం చేసి ఆమెపై ఉన్న ప్రేమను ప్రూవ్ చేసుకున్నాడు రామ్ చరణ్ . ఉపాసన - రాంచరణ్ ఎంత అన్యోన్యంగా ఉంటారో మనకు తెలిసిందే. ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది లవబుల్ కపుల్ అనే చెప్పాలి.  ఉపాసన కూడా చాలా చాలా మంచి వ్యక్తి . అంతకంటే మంచి వ్యక్తి మన రామ్ చరణ్ . అయితే ఉపాసన సరదాగా ఒకనాడు "నా పేరును టాటూ వేయించుకోవా ..? అందరు వేయించుకుంటున్నారుగా" అంటూ సరదాగా అడిగిందట .



అయితే అప్పటివరకు టాటూస్ అంటే ఇష్టం లేని రాంచరణ్ ఉపాసన అడిగింది అన్న కారణంగా తనకు ఇష్టం లేకపోయినా సరే ఉపాసన ముద్దు పేరు "ఉప్సి" అంటూ టాటూ  వేయించుకున్నారట . అది చూసిన ఉపాసన షాక్ అయిపోయిందట . "నేను సరదాగా అన్నాను నువ్వు ఇంత సీరియస్ గా తీసుకున్నావా అంటూ ఎమోషనల్ కూడా అయిందట".  ఉపాసన కోసం ఏ పని చేయడానికి అయినా సిద్ధంగా ఉంటాడు రామ్ చరణ్ అని చెప్పడానికి ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్.  ప్రజెంట్ గేమ్ ఛేంజర్ సినిమా రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నాడు రామ్ చరణ్..!!

మరింత సమాచారం తెలుసుకోండి: