అయితే మన తెలుగు చిత్ర పరిశ్రమలో నటరత్న ఎన్టీఆర్ ఎక్కువగా డ్యూయల్ రోల్ సినిమాల్లో నటించారు. ఇక తన సుదీర్ఘ సిని జీవితంలో 35కు పైగా సినిమాల్లో ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేశారు.. ఈ రికార్డును ఇప్పటివరకు ఏ హీరో కూడా బ్రేక్ చేయలేకపోయారు. అలాగే ఎన్టీఆర్ తర్వాత టాలీవుడ్ లో ఎక్కువగా డ్యూయల్ రోల్ సినిమాల్లో కనిపించని హీరో నటసింహం నందమూరి బాలకృష్ణ .. బాలయ్య ఇప్పపటివరకు 18 సినిమాల్లో డ్యూయల్ రోల్స్ లో కనిపించడు. అపూర్వ సహోదరులు సినిమాలో తొలిసారిగా డ్యూయల్ రోల్‌లో బాలకృష్ణ నటించాడు. ఈ సినిమాని రాఘవేంద్రరావు తెరకెక్కించారు. ఆ తర్వాత రాముడు భీముడు, ఆదిత్య 369, సింహా, లెజెండ్, అఖండ నుంచి వీరసింహారెడ్డి వరకు మొత్తం 18 సినిమాల్లో రెండు పాత్రలో కనిపించారు బాలయ్య. అలాగే 2012లో విడుదలైన అధినాయకుడు సినిమాలో ఏకంగా మూడు గెటప్పుల్లో కనిపిస్తారు బాలయ్య. ఇక బాలకృష్ణ డ్యూయల్ రోల్ లో నటించిన సినిమాలు చాలా వరకు బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్ గా నిలిచాయి. అలాగే సమకాలీన హీరోలలో ఎక్కువ సినిమాల్లో ద్విపాత్రాభినయం చేసిన హీరోగా బాలకృష్ణ మొదటి స్థానంలో ఉన్నాడు. అలాగే చిరంజీవి కూడా ఆయన కెరీర్ లో ఏడు సినిమాలలో డ్యూయల్ రోల్స్ లో కనిపించాడు. అలాగే ముగ్గురు మొనగాళ్లు సినిమాల్లో ఏకంగా త్రిపాత్రాభినయంలో చేశాడు.
అంతేకాకుండా ఎన్టీఆర్ - బాలకృష్ణ కలయికలో 12 సినిమాలు వచ్చాయి టాలీవుడ్ లో ఎక్కువ సినిమాలు కలిసి చేసిన తండ్రి కొడుకులుగా కూడా ఎన్టీఆర్ - బాలకృష్ణ రికార్డు సృష్టించారు. ఇక తండ్రి ఎన్టీఆర్ దర్శకత్వంలో బాలకృష్ణ మొత్తం 7 సినిమాల్లో నటించారు. అలాగే ప్రస్తుతం దర్శకుడు బాబి దర్శకత్వంలో తన 109వ సినిమా చేస్తున్న విషయం తెలిసింది. ఈ సినిమాను సంక్రాంతి కానుకగా ప్రేక్షకులు ముందుకు తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు. అలాగే రీసెంట్ గానే బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ 2 షూటింగ్ను కూడా మొదలు పెట్టబోతున్నాడు. ఇలా టాలీవుడ్ లోనే అత్యధిక డ్యూయల్ రోల్స్‌లో నటించని హీరోలుగా ఎన్టీఆర్ - బాలకృష్ణ రికార్డును నెలకొల్పారు.