ఎప్పుడు మనం తీసుకున్న డెసిషన్స్ కరెక్ట్ గానే ఉంటాయా..? అంటే నో అని చెప్పాలి . కొన్ని కొన్ని సార్లు మనం తీసుకున్న డెసిషన్స్ కారణంగా బొక్క బోర్లా కూడా పడేలా చేస్తూ ఉంటాయి. అది ఎంత పెద్ద స్టార్ హీరో అయినా సరే . అదే లిస్టులోకి వస్తాడు జూనియర్ ఎన్టీఆర్ . ఈయన గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన పనిలేదు. పెద్ద స్టార్ సెలబ్రిటి. కోట్లల్లల్లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. ప్రసెంట్ పాన్ ఇండియా స్ధాయిలో సినిమాలు చేస్తూ బిజీ బిజీ గా ఉన్నాడు.


సాధారణంగా నందమూరి ఫ్యాన్స్ కు ఓ అభిప్రాయం ఉంటుంది . జూనియర్ ఎన్టీఆర్ ఏ సినిమానైనా సరే ఓకే చేస్తే ఆ సినిమా అస్సలు ఫ్లాప్ అవ్వదు హిట్ అవుతుంది అని.  అలా ఆచితూచి ఆలోచించే ఆ సినిమాకు కమిట్ అవుతాడు జూనియర్ ఎన్టీఆర్ అంటూ ఫ్యాన్స్ భావిస్తూ ఉంటారు . కానీ జూనియర్ ఎన్టీఆర్ కూడా తన కెరీర్ లో కొన్ని కొన్ని సార్లు రాంగ్ డెసిషన్ తీసుకున్నాడు అంటూ ప్రూవ్ అయింది . మరీ ముఖ్యంగా "శక్తి" సినిమా విషయంలో ఆయన నిర్ణయం రాంగ్ అంటూ పక్కాగా ప్రూవ్ చేసేసుకున్నారు ఎన్టీఆర్ .



మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అట్టర్ ప్లాప్ అయింది . ఎంతలా అంటే ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా ఎందుకు రా బాబు ఈ సినిమా చేశావు..? అన్ని ఓ రేంజ్ లో ట్రోల్ చేశారు . అయితే జూనియర్ ఎన్టీఆర్సినిమా కథని విన్నప్పుడు ముందుగా వద్దు వద్దు అని అనుకున్నారట . దాదాపు మూడుసార్లు ఈ సినిమాని రిజెక్ట్ చేసినట్లే చేసి వదిలేసారట.  కానీ మెహర్ రమేష్ పై ఉన్న రెస్పెక్ట్ ఆయనతో ఉన్న ఫ్రెండ్షిప్ కారణంగానే ఈ సినిమాను ఓకే చేశారట . అయితే ఈ సినిమా మాత్రం అస్సలు జనాలకి నచ్చలేదు . అట్టర్ ప్లాప్ అయింది . అసలు ఈ సినిమాను ఎన్టీఆర్ కథ వినే చేశాడా ..? అంటూ దారుణమైన కామెంట్స్ కూడా చేశారు జనాలు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: