నాగార్జున అంటే ఒక స్టార్ హీరో ..ఒక బడా హీరో కొడుకు ..ఒక బడా ఫ్యామిలీ నుంచి వచ్చి ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకొని.. తన కొడుకులకు కూడా లైఫ్ ఇవ్వాలి అనుకుంటున్నా ఒక హీరో . ఇలాంటి ఒక స్టార్ స్టేటస్ కి సంబంధించిన చరిత్ర వినపడుతుంది . అయితే నాగార్జున కూడా తన కెరియర్ లో కొన్ని తప్పులు చేశాడు . ఆ తప్పుల కారణంగా సోషల్ మీడియాలో బాగా ట్రోల్ అయ్యాడు . మరీ ముఖ్యంగా నాగార్జున ఫ్యాన్స్ కూడా ఆయనను హేట్ చేసిన సినిమా అంటే మాత్రం "కృష్ణార్జున" అనే చెప్పాలి .


మంచు విష్ణు హీరోగా నటించిన ఈ సినిమాలో నాగార్జున స్పెషల్ క్యారెక్టర్ లో కనిపిస్తాడు. ఈ సినిమాలో ఆయన దేవుడు పాత్రలో మెప్పిస్తాడు . అయితే ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత నాగార్జున ఫ్యాన్స్ ఆయనపై మండిపడ్డారు . అంత పెద్ద హీరోవి అలాంటి పాత్ర ఎలా ఒప్పుకున్నావ్? అసలు నీకు ఆ సినిమాలో వాల్యూనే లేదు అంటూ చాలా చాలా కోపడ్డారు . ఒకానొక సందర్భంలో అక్కినేని ఫ్యాన్స్ ఆ సినిమాని బ్యాన్ చేయాలి అంటూ కూడా మాట్లాడారు . అయితే నాగార్జున మాత్రం ఆ తర్వాత అలాంటి భారీ రిస్క్ చేయనే చేయలేదు. ఏ సినిమాలో కూడా గెస్ట్ పాత్రలో కనిపించలేదు .



అంతేకాదు "కృష్ణార్జున" సినిమా ఎంత అట్టర్ ఫ్లాప్ అయిందో అందరికీ తెలిసిందే . అసలు నాగార్జున ఈ సినిమాలో ఉన్నాడు ..ఆయన క్యారెక్టర్ ఉంది అని చాలామంది జనాలకు తెలియదు. అక్కినేని ఫ్యాన్స్ మాత్రం ఈ సినిమా రిలీజ్ అయిన కొత్తలో అక్కినేని నాగార్జునను చాలా చాలా వేడుకున్నారు . "మీకు దండం పెడతాము.. మీరు  మాత్రం ఇక ఇలాంటి గెస్ట్ రోల్స్ చేయొద్దు.. అది కూడా ఇలాంటి మీకు వాల్యూ లేని కంటెంట్ ఉన్న సినిమాలలో అసలు నటించొద్దు "అంటూ చాలా రిక్వెస్ట్ చేశారు . ఫ్యాన్స్ రిక్వెస్ట్ విన్నాడో ఏమో ఇప్పటివరకు నాగార్జున గెస్ట్ రోల్  చేసింది లేదు. కాగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న "కుబేర" సినిమాలో కీలకపాత్రలో మెరుస్తున్నారు నాగ్. అయితే ఈ సినిమాకి కర్త - కర్మ - క్రియ అంతా కూడా నాగార్జుననే కావడంతో ఈ పాత్రను ఓకే చేశాడట. చూద్దాం సినిమా రిలీజ్ అయ్యాక పరిస్థితి ఏ విధంగా ఉంటుందో..??

మరింత సమాచారం తెలుసుకోండి: