ఇకపోతే, ఈ వారం ప్రేక్షకుల నుంచి అతి తక్కువ ఓట్లు వచ్చిన గౌతమ్ ఎలిమినేట్ కావాల్సి ఉండగా, మణికంఠ తనని తాను ఎలిమినేట్ చేయమని కోరడంతో అది కాస్త గౌతమ్ కి చాలా ప్లస్ అయింది. కట్ చేస్తే మణికంఠని ఇంటి నుంచి బయటకు పంపారు. అది చూసి బిగ్ బాస్ ఇంటి సభ్యులు, బుల్లితెర ఆడియన్స్ చాలా ఆశ్చర్యానికి గురయ్యారు. 'తప్పు నిర్ణయం తీసుకున్నాడు', 'గౌతమ్ వెళ్లిపోయేవాడు.. అనవసరంగా కెలుక్కున్నాడు' అంటూ కామెంట్స్ చేసారున్నారు. అనంతరం వేదికపైకి వచ్చిన మణికంఠతో ఎందుకు సెల్ఫ్ ఎవిక్షన్ చేసుకున్నావు అని నాగార్జున అడగగా... ''ఎనర్జీ తగ్గిపోయింది. ఫన్ టాస్క్ వచ్చినప్పుడు ఆలోచిస్తున్నా. ఫిజికల్ టాస్క్‌కి వస్తే, చాలా ఒత్తిడికి లోనవుతున్నా. ఎక్కడో మునిగిపోయినట్లు అనిపిస్తోంది. ప్రస్తుతం చాలా రిలీఫ్‌గా ఉన్నా. నాకు ఓటు వేసిన వాళ్లందరికీ క్షమాపణ చెబుతున్నా!" అంటూ వెనుదిరిగాడు.
ఈ సందర్భంగా మణికంఠ ఇంకా మాట్లాడుతూ... "నా ఆరోగ్యమే నాకు ముఖ్యం అని అనిపించింది. లక్ష్మీ దేవి కంటే ఆరోగ్యం ముఖ్యం కదా. ఆరోగ్యం దెబ్బతింటే వచ్చిన లక్ష్మీదేవి కూడా నన్ను కనికరించదు. నేను ఇక్కడకు వచ్చినప్పుడు ఎవరికీ తెలియదు. బిగ్‌బాస్ వేదిక వలెనే నాకు మంచి పాపులారిటీ దక్కింది. ప్రేక్షకుల సహకారం వల్లే నేను ఇక్కడి దాకా వచ్చా. కానీ, నా ఆరోగ్యం నాకు ముఖ్యం. నాకు పునర్జన్మ లభించినట్టు అయింది!'' అని అన్నాడు.