యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, బాలీవుడ్ గ్రీకు వీరుడు హృతిక్ రోషన్ కాంబోలో తెరకెక్కుతున్న వార్ 2 సినిమా గురించి జనాలకు తెలిసిందే. ప్రస్తుతం అందుతున్న సమాచారం మేరకు, ప్రస్తుతం ఈ సినిమా ఇటలీ షెడ్యూల్ పూర్తి చేసుకుంటోంది. అది పూర్తి చేసుకుని ఇండియాకు వచ్చాక ముంబైలో సెట్స్ లో జరగబోతున్న షూటింగ్ లో తారక్ పాల్గోనున్నాడు. ప్రస్తుతం దేవర సినిమా హిట్టుతో ఎన్టీఆర్ అభిమానులు మంచి జోష్ లో ఉండగా తాజా సమాచారం వారిని మరింత సంతోషింపజేసింది. ఈ క్రమంలోనే వార్ 2 సినిమాలతో ఎన్టీఆర్ పోషించబోతున్న పాత్ర మీద సర్వత్రా ఉత్కంఠత నెలకొంది. మరో విషయం ఏమిటంటే, డబ్బింగ్ వెర్షన్ల కోసం సదరు సినిమా టైటిల్ మారుస్తున్నారనే ప్రచారం జరుగుతోంది.

ఈ క్రమంలోనే "యుద్ధభూమి" పేరుని తెలుగు, తమిళ తదితర బాషల కోసం పెడుతున్నారనే టాక్ నడుస్తోంది. అయితే యూనిట్ నుంచి ఆఫ్ ది రికార్డు అందుతున్న సమాచారం మేరకు వార్ 2ని మార్చే ప్లాన్ లేదని తెలుస్తోంది. యుద్ధభూమిని క్యాప్సన్ గా వాడే అవకాశం ఉందని అంటున్నారు. వార్ అంత పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యాక టైటిల్ మార్చే తొందరపాటు చర్య "యష్ రాజ్ ఫిలింస్" చేయదని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో తమ అభిప్రాయాలను వెళ్లబుచ్చుతున్నారు. పైగా స్పై యూనివర్స్ ని విస్తరించే క్రమంలో టైగర్, పఠాన్, కబీర్, అల్ఫా పాత్రలన్నింటినీ అవెంజర్స్ తరహాలో డిజైన్ చేస్తున్నారు నిర్మాత ఆదిత్య చోప్రా.

వార్ టైటిల్ అనేది జనాల్లోకి బాగా బలంగా చొచ్చుకుపోయింది కాబట్టి దానికి వార్ 2 అని టైటిల్ పెట్టడమే న్యాయమని చెబుతున్నారు. వచ్చే ఏడాది ఆగస్ట్ 14 విడుదల కాబోతున్న వార్ 2 చిత్రీకరణ దర్శకుడు అయాన్ ముఖర్జీ ఫిబ్రవరిలోగా పూర్తి చేసే ప్లాన్ లో ఉన్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. పోస్ట్ ప్రొడక్షన్ కోసం ఎక్కువ సమయం కేటాయించి, బెస్ట్ అవుట్ ఫుట్ ఇచ్చేలా వర్క్ చేస్తున్నారు చిత్ర యూనిట్. ఇండియన్ స్క్రీన్ మీద ఎప్పుడూ చూడని బెస్ట్ యాక్షన్ విజువల్స్ వార్ 2లో ఉంటాయని సమాచారం. ఇక నాటు నాటుని మించిపోయేలా తారక్, హృతిక్ మధ్య ఒక డాన్స్ నెంబర్ ఉంటుందని గుసగుసలు వినబడుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: