RRR చిత్రంతో రామ్ చరణ్ ఇండియాలోనే కాదు ఇతర దేశాలలో కూడా మంచి పాపులారిటీ అందుకున్నారు.. జపాన్లోనే కాకుండా హాలీవుడ్ లో కూడా రామ్ చరణ్ కు అభిమానులు ఏర్పడ్డారు. ముఖ్యంగా నాటు నాటు పాటతో చాలా దేశాలలో కూడా రామ్ చరణ్ బాగానే గుర్తింపు సంపాదించుకున్నారు. ఇప్పుడు తాజాగా సౌత్ కొరియాలో కూడా రామ్ చరణ్ క్రేజ్ పాకి పోతున్నట్లు తెలుస్తోంది. పాన్ ఇండియా లెవెల్ లోనే ఈ చిత్రాన్ని కూడా రామ్ చరణ్ విడుదల చేసేలా ప్లాన్ చేయడమే కాకుండా భారీ బడ్జెట్ తోనే రిలీజ్ చేయబోతున్నారు. దిల్ రాజు నిర్మాతగా ఉండగా.. కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తోంది.


శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ సినిమా షూటింగ్ చేస్తున్న సంగతి తెలిసిందే ఇప్పటికే ఈ చిత్రం నుంచి రెండు సాంగ్స్ విడుదలయ్యాయి. అయితే ఇందులో వచ్చిన రా మచ్చ రా మచ్చ అనే పాట బాగా వైప్స్ తీసుకువచ్చింది. ఎక్కడ చూసినా ఈ పాటకు సంబంధించి ఫ్యాన్స్ తో పాటు సెలబ్రెటీలు కూడా రిలీస్ చేస్తూ వైరల్ గా చేస్తున్నారు. అయితే ఈ పాటకు ప్రముఖ కొరియన్ సింగర్ పార్కు మిన్ జూన్  తన టీం తో కలిసి గేమ్ చేంజర్ చిత్రంలోని ఈ పాటకు స్టెప్స్ వేయడం జరిగింది. అందుకు సంబంధించిన ఒక వీడియో కూడా ఇంస్టాగ్రామ్ లో వైరల్ గా మారుతున్నది.


దీంతో పలువురు నెటిజన్స్ రామ్ చరణ్ క్రేజ్ దేశాలు దాటుతోందంటూ కామెంట్స్ చేస్తున్నారు. కచ్చితంగా గేమ్ చేంజెర్ సినిమా గ్లోబల్ స్థాయిలో సక్సెస్ అవుతుందని నమ్మకాన్ని కూడా తెలియజేస్తున్నారు. మొత్తానికి ఈ కొరియన్ సింగర్ చేసిన ఈ డాన్స్ మాత్రం అభిమానులకు పిచ్చపిచ్చగా నచ్చేలా కనిపిస్తోంది. మరి సినిమా వచ్చేయేడాది సంక్రాంతికి రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు ఈ ఏడాది రిలీజ్ కావలసి ఉండగా కొన్ని కారణాల చేత పోస్ట్ ఫోన్ చేసినట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: