నిజానికి వ్యాంపు పాత్రలను ప్రత్యేకంగా ఒక పాటకే పరిమితం చేసే పరిస్థితి అప్పట్లో ఉండేది కాదు .. వారిని కూడా సినిమాలలో భాగంగా చేసేవారు. ఆ తర్వాత ఒకపాటికి పరిమితం చేస్తూ వచ్చారు. ఇలా ఎన్టీఆర్ తో అనేక సినిమాలలో జయమాలిని స్టెప్పులు వేసి ప్రత్యేకమైన పాటలలో ఆడి పాడింది. కొన్నిసార్లు అవుట్ డోర్ షూటింగ్ లలో ఒకే చోట అందరూ కలిసి పడుకునేవారు. దీనిపై ఎలాంటి అభిప్రాయ బేధాలు ఉండేవి కావు.. అయితే అప్పట్లో జ్యోతి చిత్రపత్రిక ఓ కథనం ప్రచురించింది.
ఆ కథనం టైటిల్ ఏంటంటే జయమాలిని వర్జినిటీ కోల్పోయారు..! అని హెడ్డింగ్‌తో వచ్చిన కథనం పెద్ద సంచలనం, వివాదం కూడా అయింది. దర్శకుడు రాఘవేంద్రరావు తీసిన ఓ సినిమాలో జయమాలిని, ఎన్టీఆర్ కలిసి ఓ పాటలో నటించారు. ఇది అవుట్ డోర్ షూటింగ్ గా జరిగింది. వెంటనే జయమాలినిని అన్నగారు వాడుకున్నారు.. అన్నగారు అస్సలు ఆకలిని, ఆకాంక్షను ఆపుకోలేరు అని రాసేశారు.
అలాగే జయమాలిని కూడా ఓకే చెప్పింది. అని కథనం ఉండడంతో పెను దుమారం రేపింది. దీనిపై ఎన్టీఆర్ సీరియస్ కావడంతో పాటు ఆ పత్రిక ఎడిటర్‌కు వార్నింగ్ ఇచ్చారు. దీంతో మరుసటి రోజు సవరణ వేసుకున్నారు. ఇది ఇప్పటికీ సినీ ఇండస్ట్రీలో పెద్ద సంచలనమే అని చెప్పాలి.