అలాంటి నాగ్ అశ్విన్ సింప్లిసిటీ గురించి జనాలకు చెప్పాల్సిన పనిలేదు. కనీసం తాను వేసుకొనే బట్టలు, చెప్పుల విషయంలో కూడా నాగ్ పెద్దగా ఆలోచించాడు. ఒక సాధారణ మధ్య తరగతి కుర్రాడిలా జీవిస్తున్న నాగ్ అశ్విన్ జీవితం అందరికీ స్ఫూర్తి దాయకం అని చెప్పుకోవాలి. ఆమధ్య నాగ్ అశ్విన్ వేసుకున్న చెప్పుల గురించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సంగతి తెలిసినదే. కాగా ప్రస్తుతం అతను వాడుతున్న కారు గురించి సర్వత్రా చర్చ నడుస్తోంది. ఒకప్పుడు ఎలా ఉన్నా, ఇప్పుడు కోట్లు సంపాదిస్తున్న నాగ్ అశ్విన్ అంత సాధారణమైన జీవితం గడుపుతుండడం హాట్ టాపిక్ అయ్యింది.
ఇకపోతే కల్కి మూవీ రిలీజ్ సమయంలో నాగ్ అశ్విన్ వాడిన మహీంద్రా e2o ఎలక్ట్రిక్ కారుకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు నెట్టింట వైరల్ అయిన సంగతి అందరికీ తెలిసినదే. తాజాగా మరోసారి ఆ కారు టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. దానికి కారణం... ఆయన పెట్టిన పోస్టే. రీసెంట్ గా నాగీ ఇన్ స్టాలో తన బుజ్జి కారు పిక్ ను షేర్ చేశారు. "నా వాహనం.. e2oplus.. మహీంద్రా ఎలక్ట్రిక్ కారుని నా ఇంటిపై ఉన్న సోలార్ ప్యానెల్స్ తో ఛార్జ్ చేస్తా!" అని ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. దాంతో ఆ పోస్ట్.. సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో వైరల్ అవుతోంది. దీంతో నాగ్ అశ్విన్ సింప్లిసిటీ కోసం ఎంత చెప్పినా తక్కువేనని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. దాంతో రూ.1200 కోట్లు రాబట్టిన సినిమా తీసిన దర్శకుడు మిడిల్ క్లాస్ జనాలు వాడే ఇంత చిన్న కారు వాడుతున్నారా? అని జనాలు ఆశ్చర్యపోతున్నారు.